Warangal Airport: జూన్‌లో వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన!

Read Time:  1 min
Warangal Airport: జూన్‌లో వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన!
FONT SIZE
GET APP

Warangal Airport : వరంగల్ వమానాశ్రయానికి మొత్తం 953 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చినట్లు, దీంతో 2500 మీటర్ల రన్నే నిర్మాణం చేపట్టనున్నట్లు 2026 జూన్ నెలలో కంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో విమానయాన ప్రాజెక్టులపై న్యూఢిల్లీలోని రాజీవ్ గాంధీభవన్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)తో మధ్య హృదపూర్వకంగా సమావేశ మయ్యారు.

Keralam State Name Change: కేరళ పేరును ‘కేరళమ్‌’ మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Warangal Airport: Foundation stone for Warangal Airport to be laid in June!
Warangal Airport: Foundation stone for Warangal Airport to be laid in June!

ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అవసరమైన చర్యలు

తెలంగాణ రాష్ట్రం లోని విమానాశ్రయాల అభివృద్ధిపై పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్తో సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిని ఇద్దరు మంత్రులు సంయుక్తంగా సమీక్షించారు. ఈ సందర్భంగా వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి సహా తెలంగాణలో ప్రతి పాదిత, పనులు జరుగుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులపై వినృత చర్చ జరిగింది. ప్రాజెక్టుల వేగవంతమైన
అమలుకు అవసరమైన చర్యలు, కేంద్రరాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తయ్యేలా సమయానుగుణంగా సమీక్ష నిర్వహించాలని ఇద్దరు మంతులు నిర్ణయించారు. ఏవైనా పరిపాలనా పరమైన, సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినట్లయితే వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆదిలాబాద్లో విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, అయితే దన్వీ నిర్మా ణానికి రక్షణ మంత్రిత్వ శాఖ (కేంద్రప్రభుత్వం) పరిధిలో ఉన్న ప్రస్తుత భూమిని వినియోగించనున్నట్లు ఆధికా రులు తెలిపారు. విమానాశ్రయాన్ని జస్ట్ యూసేజ్ విధానంలో ఉపయోగించే అంశంపై కేంద్రం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలు విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.

పెద్ద పల్లిలో విమానాశ్రయం కోసం 980 ఎకరాల భూమని గుర్తించామని, దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ కూడా జరుగుతున్నట్లు ఎయిర్పోర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండ “యా చైర్బర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విమాన రవాణా అనుసంధానతను పెంచడం, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి బాటలువేయడం తద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా ఈ విమానాశ్రయ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కేంద్ర ప్రభు త్వం తెలంగాణ విమానాశ్రయ మౌలిక వసతుల అ వృద్ధికి సంపూర్ణ మద్దతు అందించేందుకు కట్టుబడి ఉందని ఇద్దరు కేంద్రమంత్రులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.