📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana : తెలంగాణ లో ఓటు హక్కు ఉన్న 30 వేల మంది పేర్లు తొలగింపు : ఎందుకంటే?

Author Icon By Divya Vani M
Updated: June 18, 2025 • 7:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ఎన్నికల (Central Elections) సంఘం (ఈసీఐ) తాజా మార్గదర్శకాలను అనుసరించి, డబుల్ ఓట్లను (Bull votes) గుర్తించేందుకు కృషి సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల నమోదు లోపాలను దూరం చేయాలని ఈసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.ఏపీ, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణలో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించామని సీఈఓ వెల్లడించారు. ఇలాంటి దాదాపు 58 వేల మంది వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం పంపించిందని చెప్పారు. ఈ జాబితాలోని వారిని సంప్రదించి, వారి సూచన మేరకు ఒక రాష్ట్రంలోని ఓటు తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 30 వేల మంది పేర్లు తొలగించామని స్పష్టం చేశారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యకు పరిమితి

ఇప్పటివరకు ఒక్కో బూత్‌లో 1500 మంది ఓటర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 1000కి పరిమితం చేయాలని ఈసీఐ నిర్ణయించిందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగనుంది. ఇది ఓటర్లకు మరింత సౌలభ్యంగా ఉండేలా మారనుంది.ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సీఈఓ తెలిపారు. ఓటింగ్ సమయంలో మొబైల్ వాడకాన్ని నిరోధించడమే దీని వెనుక ఉద్దేశమన్నారు.

ఆధార్ అనుసంధానం బాధ్యతా కాకపోయినా ప్రోత్సాహం

వోటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, కానీ మరింత ఖచ్చితమైన డేటా కోసం ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇది ఎన్నికల స్వచ్ఛతకు తోడ్పడుతుందని వివరించారు.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి విషయాన్ని అసెంబ్లీ గెజిట్ ద్వారా ఈసీఐకి పంపించామని చెప్పారు. అయితే ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించాల్సిన అంశమని స్పష్టం చేశారు.

Read Also : Tet Exams : నేటి తెలంగాణ లో నుంచి టెట్ పరీక్షలు

Central Election Commission guidelines changes in polling stations Jubilee Hills by-election removal of double votes State Chief Electoral Officer Telangana voters list Voter ID Aadhaar linking

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.