📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Revanth reddy: రేవంత్ రెడ్డి మాటలను జనం నమ్మే స్థితిలో లేరు

Author Icon By Saritha
Updated: October 11, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ ఎంపి వినోద్ కుమార్

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఎన్నికలప్పుడు నమ్మారు కానీ.. ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో శుక్రవారం వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు, జీవో నంబర్ 9పై నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ (Telangana) ప్రజలు ఎవ్వరూ ఈ జీవోను నమ్మలేదు. రేవంత్ రెడ్డి (Revanth reddy) చిత్తశుద్ధితో రిజర్వేషన్లు ఇచ్చినట్టు బీసీలు నమ్మలేదు. ప్రజలు ఈ జీవోపై ముందే తీర్పునిచ్చారు. మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని రేవంత్ గతంలోనే చెప్పారు. ఎన్నికలప్పుడు ఆయన మాటలు ప్రజలు నమ్మారు కానీ ఇపుడు నమ్మడం లేదు. దసరా పండగ అపుడే ప్రజలు ఎన్నికలు జరగవని నిర్ణయానికి వచ్చారు అని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

Read also: ఎన్‌సీఆర్ వాయు కాలుష్యం & బాణసంచా నియంత్రణ

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధిపై ప్రశ్నలు సంధించిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది 1.6 శాతం ఓట్ల తేడాతోనే. భట్టి విక్రమార్క బీజేపి, బీఆర్ఎస్లను విమర్శిస్తున్నారు. బీజేపీని విమర్శిస్తే అర్థం ఉంది. బీఆర్ఎస్ నన్ను విమర్శించడానికి లేదు. గతంలోనే కేసీఆర్ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి పంపారు. కేంద్రం వద్ద అది ఇంకా పెండింగ్లో ఉంది. బీఆర్ఎస్ చిత్తశుద్ధిని శంకించడానికి లేదు. ఇందిరాగాంధీ పదవికి ముప్పు వచ్చినపుడు ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు. ఓ వ్యక్తి కోసం కాంగ్రెస్ (Revanth reddy) పార్టీ నాడు రాజ్యాంగాన్ని సవరిం చింది. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కుదరదని కృష్ణమూర్తి కేసులో సుప్రీం తీర్పు వచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు..? ఇందిరా గాంధీ కోసం రాజ్యాంగాన్ని సవరిస్తారు. బీసీల కోసం సవరించరా..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మోడీని పార్లమెంటులో కౌగిలించుకుంటారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ మోడీని ఎందుకు కౌగి లించుకోరు? అని ప్రశ్నించారు. రాహుల్ గానీ ఖర్గే గానీ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీవి మోసపూరితమాటలే తప్ప చిత్తశుద్దిలేదు. రాహుల్ మోడీ తలచు కుంటే బీసీ రిజర్వేషన్లు పెరగవా? ఈ దేశం రాజ్యాంగం మీద నడుస్తుంది తప్ప మరెవరి ఇష్టాయిష్టాల మీద కాదు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

BC Reservations BRS leader Congress criticism latest news Revanth Reddy Telangana news Telangana politics Telugu News Vinod Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.