Vikarabad crime: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో జరిగిన విషాద ఘటన స్థానికంగా కలచివేసింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్య(Suicide)కు పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్కలి దశరథం (58), ఆయన భార్య లక్ష్మి (54) అప్పుల భారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.
Read also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్
వివరాల ప్రకారం
తెలిసిన వివరాల ప్రకారం, వీరిపై లక్షల రూపాయల మేర అప్పులు ఉండగా, పెండ్లీడుకొచ్చిన కూతురు పెళ్లి బాధ్యతలతో సతమతమవుతున్న వీరు శనివారం రాత్రి భోజనం అనంతరం ఇంట్లోనే ప్రాణాలు విడిచారు.
ఈ ఘటనను గమనించిన కుమారుడు అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దంపతుల అకస్మాత్తు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు అప్పుల పరిస్థితి, కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలపై సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన మరోసారి ఆర్థిక ఒత్తిడి ఎంతటి తీవ్రమైన ప్రభావాలకు దారి తీస్తుందో తెలియజేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: