ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాలు (Road accidents) మితిమీరిపోతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, తాగి వాహనాలను నడపడం, నిద్రమత్తులో అదమరిచి డ్రైవింగ్ వల్లే అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ సిబ్బంది ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాప్రమాదాలు ఆగడం లేదు.. ప్రజల ప్రాణాలకు భద్రత లేదు. నిర్లక్ష్యడ్రైవింగ్ వల్ల అమాయకులుమరణిస్తున్నారు.
Read Also: TG: రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
ప్రజల ప్రాణాలకు భద్రత లేదు.
క్షణకాలం నిదానిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి. అదే ఆ.. ఏముందిలే అనుకుంటూ మితిమీరిన వేగంగా నడిపితే ఎదుటివారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఒకరి నిర్లక్ష్యం వల్ల ఒకరి ప్రాణం క్షణాల్లో గాల్లో కలిసిపోయింది. తాజాగా ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో కారును నడుపుతూ, రోడ్డుదాటుతున్న వ్యక్తిని ఢీకొట్టి వెళ్లాడు. మెదక్ జిల్లా (Medak) కుల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో రోడ్డుపై నడుస్తున్న శ్రీధర్ అనే వ్యక్తిని వెనక నుంచి కారులో అతి వేగంగా ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి గాల్లో ఎగిరి పల్టీలు కొట్టి కిందపడి అక్కడక్కడే మరణించాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: