📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

Venkaiah Naidu: పాత్రికేయులు తెలుగుభాషకు ప్రాధాన్యతనివ్వాలి :వెంకయ్యనాయుడు

Author Icon By Sharanya
Updated: August 6, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (ముషీరాబాద్): నేటితరం తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇనగంటి వెంకట్రావు రచించిన విలీనం- విభజన అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. బషీర్ బాగ్ (Basheer Bagh) ప్రెస్ క్లబ్నందు విలీనం-విభజన (గతం- స్వగతం, మన ముఖ్య మంత్రులు) అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. సమకాలీన రాజకీయ చరిత్ర తెలుసుకోవాలంటే తప్పకుండా విలీనం-విభజన పుస్తకం చదవాలని సూచించారు.

పత్రిక సమాజానికి దర్పణం లాంటిదని, ఈ సమాజంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత పత్రికలపై ఉందని పేర్కొన్నారు. కలానికి కులం లేదని, కేవలం కలానికి పదును మాత్రమే ఉండాలని, ప్రజాస్వామ్యంలో పత్రికలు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిజాయితీగా పనిచేయాలని సూచించారు. తెలుగు భాషను బతికించేందుకు పత్రికలు కృషి చేయాలని, తెలుగు పత్రికలలో పనిచేసే పాత్రికేయులు తెలుగుభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని (give priority to Telugu language), వారు రాసే వాటిలో సాధ్యమైనంత వరకు ఇంగ్లీషు పదాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వ్యూస్ కోసం న్యూస్ చేయకూ డదని, దానికోసమే కాలమ్స్ ఉన్నాయని గుర్తు చేశారు. రాజకీయాలలో క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ అనే నాలుగు సీలు ఉండాలని, కానీ నేడు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినాలిటీ అనే నాలుగు సీలు రాజ్యమేలు తున్నాయని విమర్శలు వస్తున్నారు. నాయకులు కూడా భాష విషయంలో హుందా తనం ప్రదర్శించాలని సూచించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అందరి భావాలు ప్రతిబింబించే పుస్తకం విలీనం-విభజన అని, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్రెడ్డి, బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/dr-g-manohar-reddy-har-ghar-tiranga-tiranga-yatra/telangana/526688/

Breaking News Journalism in Telugu latest news Patrikeyulu Telugu Journalism Telugu Language Importance Telugu News Venkaiah Naidu Venkaiah Speech

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.