Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం (Vemulawada Rajarajeshwara Temple) వద్ద భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా అధికారులు ప్రధాన ద్వారాన్ని ఇనుప రేకులతో మూసివేయడంతో, కార్తీక మాసంలో స్వామి దర్శనం లేక వేలాది మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ఆలయ పరిసరాల్లో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దక్షిణ, ఉత్తర ప్రాకారాలు, నైవేద్యశాల, ఈవో కార్యాలయం కూల్చివేత తర్వాత తాజాగా ప్రధాన ద్వారం మూసివేయబడింది. ప్రస్తుతం అర్చకులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి చతుష్కాల పూజలు నిర్వహిస్తున్నారు.
Read also: TG: యాసంగిలో 68.67 లక్షల ఎకరాల సాగు
Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..
దేవస్థానం ప్రాంగణం ఖాళీగా మారింది
Vemulawada: అయితే, కార్తీక మాసం లాంటి పవిత్ర సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం భక్తులను ఆగ్రహానికి గురిచేసింది. స్వామి దర్శనానికి వచ్చిన వారు ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్లపై కనిపిస్తున్న రాజన్నను చూసి మొక్కులు చేసుకుని వెనుదిరుగుతున్నారు. దీంతో దేవస్థానం ప్రాంగణం ఖాళీగా మారింది. అధికారులు తాత్కాలికంగా సమీపంలోని భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కోడె మొక్కులు, ఆర్జిత సేవలు కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. భక్తులు అయితే ఆలయం త్వరగా తిరిగి తెరవాలని, కనీసం పండుగ కాలంలోనైనా దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: