📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Vegetable Prices : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు

Author Icon By Sudheer
Updated: July 16, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూరగాయల ధరలు (Vegetable Prices) గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా వర్షాభావం కారణంగా పంట దిగుబడులు తక్కువయ్యాయి. దీని ప్రభావంగా మార్కెట్లలో సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. రైతులు తక్కువగా పండించిన కూరగాయలు మార్కెట్‌లోకి రావడంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడమే దీనికి కారణమని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.

ఆకాశాన్ని అంటుతున్న పచ్చిమిరప, బీన్స్ ధరలు

ప్రస్తుతం పచ్చిమిరప కిలో ధర రూ.100గా ఉండగా, బీన్స్ రూ.90, చిక్కుడు రూ.50 నుండి రూ.75 వరకు, క్యాప్సికం రూ.75గా, టమాటా రూ.45-50 మధ్యలో విక్రయించబడుతోంది. అలాగే బెండకాయ కేజీ ధర రూ.45 వరకు చేరింది. ఇటీవలి నెలలతో పోలిస్తే ఈ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయని వినియోగదారులు చెబుతున్నారు. చిన్న కుటుంబాలు కనీసం వారానికి రూ.500తో సరిపెట్టుకునే స్థితిలో ఉండేవారు ఇప్పుడు ఆ మొత్తంతో ఒక వారంకూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని వారి వాపోతు.

సామాన్యులకు భారంగా మారుతున్న ఖర్చులు

ఈ ధరల పెరుగుదలతో మధ్యతరగతి మరియు పేద కుటుంబాలపై తీవ్ర భారం పడుతోంది. నెలకు ఒకేసారి కూరగాయల కొనుగోలు చేయడం కాకుండా, రోజువారీగా కొంత కొంత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. “ఇప్పుడు కనీసం రెండు కేజీలు తీసుకున్నా రూ.200 దాటిపోతోంది. రోజూ పండ్లు, కూరగాయలతో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే డబ్బే ఎక్కువ కావాలి” అంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ధరల పెరుగుదలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also : ట్రంప్ హత్యకు కుట్ర? వైట్ హౌస్‌పై దాడి భయంతో లాక్‌డౌన్

Google News in Telugu Telangana Vegetable Prices Vegetable Prices in market

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.