📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: VC Sajjanar: ప్రతి శనివారం ఉత్తమ పోలీసులకు రివార్డులు

Author Icon By Anusha
Updated: October 12, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు నాలుగేళ్ల పాటు ఆర్టీసీ ఎండీ (RTC MD) గా సుళ్ల సేవలు అందించిన వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే వీఐపీలకు వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చేయొద్దని హెచ్చరించారు.

AP Weather Alert:– వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

తన నియామకం తర్వాత, సజ్జనార్ (VC Sajjanar) సిటీ పోలీస్ విధానంలో ముఖ్యమైన మార్గదర్శక సూత్రాలు ప్రకటించారు. ముఖ్యంగా వీఐపీలకు ఆన్‌లైన్ బెట్టింగ్, ఇతర అనధికారిక కార్యకలాపాలను ప్రమోట్ చేయొద్దు అని హెచ్చరించారు..నగరంలో డ్రగ్స్ కట్టడికి కూడా ప్రయత్నా చేస్తామని చెప్పారు. డ్రంగ్ డ్రైవ్ విషయంలో కఠినంగా ఉంటామని చెప్పారు.

చెప్పినట్లుగానే సీపీ సజ్జనార్ తన మార్క్ పోలీసింగ్ చూపిస్తున్నారు. అందులో భాగంగా ‘ ఎక్స్‌ట్రా మైల్ రివార్డ్ ‘ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మానవతా దృక్పథంతో పనిచేస్తూ.. ప్రజల మన్ననలు పొందే సిబ్బందిని ప్రోత్సహించేందుకే ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ (Hyderabad City Police Commissioner) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం (అక్టోబర్ 11) తొలిసారిగా అన్ని విభాగాలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు.

అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ కమిషనరేట్ చాలా పురాతనమైనదని చెప్పారు. అలాంటి కమిషనరేట్ ప్రతిష్ఠను మరింత పెంచాలని అన్నారు. అందుకే పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు.. సలహాలు, సూచనలు జారీ చేశారు సజ్జనార్.ఎక్స్‌ట్రా మైల్ రివార్డ్ ప్రోగ్రాం (Extra Mile Rewards Program) లో భాగంగా ప్రతి శనివారం ఉత్తమ పని తీరు కనబర్చిన సిబ్బందిని గుర్తిస్తారని సీపీ చెప్పారు.

ఎంపిక చేసిన వారికి ప్రశంసాపత్రం, రివార్డుతో సన్మానిస్తారన్నారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరం (Drug-free city) గా మార్చడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కేసుల్లో లోతుగా విచారణ జరిపి.. దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని చెప్పారు.ఈ సమావేశం సందర్భంగా ఇటీవల ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీసులను వీసీ సజ్జనార్ ప్రశంసించారు.

చిన్నారి హత్య కేసును.. ఛేదించడంలో

ఇటీవల మాదన్నపేటలో జరిగిన చిన్నారి హత్య కేసును.. ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు సుధాకర్, శోభ, సాయికాంత్, శివకుమార్‌తో పాటు ఇతర సిబ్బందిని సజ్జనార్ అభినందించారు. ఇక నిరాశ్రయులను ఆదరించి ఆశ్రమానికి తరలించిన అఫ్జల్‌గంజ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రవి,

ఎస్‌ఐ నిరంజన్, ఏఎస్ఐ ధర్మేందర్‌‌ను ప్రశంసించారు. అంతేకాకుండా ఓ కేసులో 30 ఏళ్ల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ విజయ సుధాకర్, కానిస్టేబుల్ సురేందర్‌‌ను కూడా వీసీ సజ్జనార్ ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Telugu News VC Sajjanar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.