📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: VC Sajjanar: హైదరాబాద్ లో భారీ స్థాయిలో ‘ఆపరేషన్ కవచ్’

Author Icon By Saritha
Updated: December 6, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్(Hyderabad) నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో(VC Sajjanar) విస్తృతమైన నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కమిషనరేట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. నగరంలో భద్రతను మరింత పటిష్ఠం చేసే ఉద్దేశంతో రాత్రి 10 గంటల నుంచి నగరవ్యాప్తంగా ఈ తనిఖీలను ముమ్మరం చేశారు.

Read also: ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

Massive ‘Operation Kavach’ in Hyderabad

5,000 మంది సిబ్బందితో ఏకకాలంలో తనిఖీలు

ఈ ‘ఆపరేషన్ కవచ్’ డ్రైవ్‌లో సుమారు 5,000 మంది పోలీసు సిబ్బంది ఏకకాలంలో పాల్గొంటున్నారని కమిషనర్(VC Sajjanar) తెలిపారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా ఇందులో భాగమయ్యాయి. నగరంలోని 150 కీలక ప్రాంతాలలో ఈ ముమ్మర తనిఖీలను నిర్వహిస్తున్నారు. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నగర పౌరులు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

City Security hyderabad Hyderabad Police Latest News in Telugu Law and order Nakabandi Operation Kavach VC Sajjanar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.