📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vaddepally Municipality Controversy: మాకు జాగృతికి సంబంధం లేదు: వడ్డేపల్లి శ్రీనివాస్

Author Icon By Tejaswini Y
Updated: February 13, 2026 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vaddepally Municipality Controversy: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నామని ప్రకటించిన జాగృతి చీఫ్ కవితకు ఊహించని షాక్ తగిలింది. తమ అభ్యర్థే గెలిచారని ఆమె పేర్కొన్నప్పటికీ, విజేత వడ్డేపల్లి శ్రీనివాస్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు.

Read Also: Amarchinta Municipal Election Results: మూడు పార్టీలకు మూడేసి సీట్లు ఇచ్చిన ఓటర్లు

అసలు విషయంలోకి వెళ్తే

జాగృతి సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని వడ్డేపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను జాగృతిలో చేరలేదని, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచే పోటీ చేసి విజయం సాధించానని ఆయన స్పష్టం చేశారు. తాము గెలిచామని కవిత చేస్తున్న ప్రకటనలపై శ్రీనివాస్ క్లారిటీ ఇవ్వడంతో, చైర్మన్ పీఠం వివాదం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Vaddepally Municipality Controversy

ఆమెతో మేము మాట్లాడింది లేదు:

ఏఐఎఫ్ నేత వడ్డేపల్లి శ్రీనివాస్ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ.. మాకు జాగృతికి సంబంధం లేదన్నారు. AIFB పార్టీ నుండి బీఫాం తీసుకోవడానికి వెళ్ళినపుడు కవిత జాగృతి కండువా మాకు కప్పిందని కానీ ఆమె మాకు ప్రచారానికి వచ్చింది లేదు, ప్రచారంలో ఆమె కండువా మేము వేసుకున్నది లేదని, ఆరోజు తరువాత ఆమెతో మేము మాట్లాడింది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా వడ్డేపల్లిలో మొత్తం 10 వార్డులు ఉండగా ఇందులో 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విజయం సాధించగా చెరొ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపొందాయి.

గంటల వ్యవధిలోనే ఆవిరైన ఆనందం

రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జాగృతి చీఫ్ కవితకు వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫలితాలు మిశ్రమ అనుభవాన్ని మిగిల్చాయి. ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేకపోవడంతో, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీకి ఆమె మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆ పార్టీ వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో జాగృతి శ్రేణులు భారీ సంబరాలు చేసుకున్నాయి.

అయితే, ఈ ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ గెలుపులో కవితకు లేదా జాగృతి సంస్థకు ఎలాంటి పాత్ర లేదని ఆయన స్పష్టం చేయడంతో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో కవితకు గెలుపు సంబరాలు కాస్తా చేదు అనుభవంగా మిగిలాయి. ఈ పరిణామాలపై కవిత ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jogulamba Gadwal Election News Kavitha Jagruthi Shock Vaddepally telangana local body elections Vaddepally Municipality Results 2026 Vaddepally Srinivas Forward Block

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.