📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Uttam Kumar Reddy: సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం

Author Icon By Tejaswini Y
Updated: January 12, 2026 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : ఎస్ఎల్బీసి నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పేర్కొనానరు. భూగర్భ పరిస్థితుల అంచనాకు సపోర్ట్ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..

ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, ఇంజనీర్లతో మంత్రి సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు. యుద్ధ ప్రాతి పదికన పునఃప్రారంభ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సొరం గం తవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయో గించనున్నట్లు తెలిపారు. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతి లో టన్నెల్ తవ్వకాలు జరపనున్నారని, మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలో మీటర్ల పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పూర్తయి నట్టు అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు.

Uttam Kumar Reddy: Modern technology for tunnel excavation

భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్ట్ సిస్టం కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం ఎస్ ఎల్బీసీని పూర్తి చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా తీసుకుందని మంత్రి వివరించారు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి 25 శాతం అదనపు జీతాలు ఉంటాయని అన్నారు. భారత రాష్ట్ర సమితి పది సంవత్సరాల పాలన వల్లే ఎస్ఎల్బీసీ పనుల్లో ఆలస్యం జరిగిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణ పనులపై ప్రతి సోమవారం సమీక్ష చేస్తామని తెలిపారు.

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు(SLBC Project) పూర్తి చేసి నల్గొండను సస్యశ్యామలం చేయడమే కాకుండా, ఫ్లోరోసిసన్ను శాశ్వతంగా లేకుండా చేస్తామని మంత్రి ప్రకటించారు. సొరంగం తవ్వకాల్లో నూతన టెక్నాలజీ.. గతంలో వినియోగించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ (టిబిఎం) స్థానంలో ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. మిగిలిఉన్న 9.8 కిలోమీటర్ల సొరంగం మార్గంలో భూగర్భ పరిస్థితుల ను అంచనా వేసేందుకు ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ఇప్పటికే పూర్తి చేశారు. తవ్వకం సమయంలో మట్టి పొరలు విరిగిపడకుండా ఉండేందుకు >>2 పటిష్టమైన సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటుచేస్తున్నారు.

పనులు త్వరగా పూర్తి కావడానికి వీలుగా సొరంగం రెండు చివరల నుండి ఏకకాలంలో తవ్వకాలు జరపడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష ్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గంగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టు, కఠినమైన రాతి పొరలు, సాంకేతిక లోపాల వల్ల రెండు దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. గతంలో వాడిన టీబీఎం యంత్రాలు భూగర్భంలోని వేడికి, కఠిన శిలల ఒత్తిడికి తరచూ పాడైపోవడంతో పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వాల హయాంలో నిధుల కొరత, కాంట్రాక్టర్ల సమస్యల వల్ల నల్గొండ జిల్లా రైతులకు అందాల్సిన సాగునీరు, ప్రజల తాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి 25 శాతం అదనపు జీతాలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Modern Technology Tunnel Nalgonda Fluorosis SLBC project SLBC Tunnel Telangana Irrigation Tunnel Construction uttam kumar reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.