📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Uttam Kumar Reddy: తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ లేదు

Author Icon By Tejaswini Y
Updated: January 10, 2026 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ : తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ పడేది లేదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. కోదాడ పట్టణం లో శుక్రవారం రూ.08 కోట్లతో నిర్మిస్తున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్(R&B Guest House) డివిజన్ కార్యాలయం, రూ 04 కోట్లతో నిర్మిస్తున్న కోర్టు భవనం, రూ. 5.10 కోట్లతో నిర్మిస్తున్న ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం పనుల పురోగతిని ఆయన స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తో కలిసి పరిశీలించి పనులు నాణ్యత తో నిర్మిస్తూ, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Read also: Revanth Reddy: రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం

Uttam Kumar Reddy

అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా నది నీటి పంపకాల్లో గత ప్రభుత్వం తెలంగాణ కు 34 (299 టి ఎం సి లు చేసుకోవటం వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు నష్టపోయాయని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కృష్ణ జలాలో 71 తెలంగాణ దక్కేలా పోరాడుతున్నామని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో నీటి పారుదల రంగానికి 1.83 లక్షల కోట్ల కేటాయించినప్పటికి కృష్ణా నది పై తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా, నెట్టెం పాడు, కొడంగల్ నారాయణపేట, డిండి. ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ లు పూర్తి చేయలేదని, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్ట్ లు వేగవంతం గా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వచ్చే మూడు సంవత్సరాల్లో కృష్ణా నదిపై నిర్మాణం లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల నష్టపోయిన కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ క దక్కాలసిన వాటా లో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని, వాటా కోసం సుప్రీం కోర్ట్, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం, నది ట్రైబ్యూనల్స్ ముందు బలమైన వాదనలు వినిపించి సాధిస్తామన్నారు. కోదాడ నియోజకవర్గం లో నిర్మిస్తున్న రెడ్ల కుంట లిఫ్ట్ ఇరిగేషన్, శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు వేగవంతంగా పూర్తి చేయాలని, పాలేరు వాగుపై రెడ్ దాం, పాలవరం లిఫ్ట్ ఇరిగేషన్ కు, నడిగూడెంలోని చౌదరి చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణం కొరకు ప్రతిపాదనలు పంపాలని, చిలుకూరు వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్ పై డబుల్ బ్రిడ్జ్, హలే అన్నారంలో బ్రిడ్జ్ పనులు త్వరగా ప్రారంభించి ఎండాకాలం చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Kodad Development Works Kodad R&B Guest House Telangana Irrigation Minister Telangana Water Share Issue uttam kumar reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.