📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:Revanth Reddy-జాతీయ రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు అవసరం

Author Icon By Pooja
Updated: September 23, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, అనుసంధాన రహదారుల నిర్మాణం అత్యవసరమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్లు, నేషనల్ హైవే అధికారులతో సీఎం నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన ముఖ్యమైన ప్రతిపాదనలతో లేఖను సీఎం రేవంత్‌కి, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు.

ప్రధాన ప్రతిపాదనలు

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేకి(Greenfield Highway) రెండు వైపులా సర్వీస్ రోడ్లు కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నగరానికి రింగ్ రోడ్ పూర్తి కావడానికి ఖమ్మం–కొరివి రోడ్ నుండి నూతన కలెక్టరేట్ వరకు 7 కిలోమీటర్ల అనుసంధాన రహదారి మంజూరు అవసరమని సూచించారు.

అలాగే జగ్గయ్యపేట–కొత్తగూడెం వయా బోనకల్, వైరా, తల్లాడ నేషనల్ హైవే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు. సారపాక–కాలేశ్వరం వయా అశ్వాపురం, ఎటూరునాగారం జాతీయ రహదారి, బూర్గంపాడు–జంగారెడ్డిగూడెం వయా ములకలపల్లి, దమ్మపేట కొత్త నేషనల్ హైవే మంజూరుకు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

రహదారుల విస్తరణతో లాభాలు

ఈ రహదారులు అభివృద్ధి(Road development) చెందితే భద్రాచలం, పాల్వంచ, మణుగూరు వంటి పారిశ్రామిక పట్టణాలు వేగంగా పురోగమిస్తాయని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి రామాలయం సహా అనేక పుణ్యక్షేత్రాలు సులభంగా అనుసంధానం అవుతాయని అన్నారు. పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి రహదారుల విస్తరణ కీలకమని, ప్రాంతీయ ప్రజలు నిజమైన లాభం పొందాలంటే ఈ ప్రతిపాదనలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలని కోరారు.

తుమ్మల నాగేశ్వరరావు ఏ విషయంపై లేఖ రాశారు?

జాతీయ రహదారుల అభివృద్ధి, అనుసంధాన రహదారుల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ అందజేశారు.

ప్రధాన ప్రతిపాదనలు ఏమిటి?

జగ్గయ్యపేట–కొత్తగూడెం, సారపాక–కాలేశ్వరం, బూర్గంపాడు–జంగారెడ్డిగూడెం కొత్త జాతీయ రహదారుల ప్రతిపాదనలు

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు

ఖమ్మం రింగ్ రోడ్ పూర్తి కోసం అనుసంధాన రహదారి

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Khammam Roads Latest News in Telugu national highways Revanth Reddy Telangana roads Telugu News Today tummala nageswara rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.