హైదరాబాద్ Urea Shortage : రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల (Metric tons) యూరియా లోటు ఏర్పడటంతో రైతులకు పంటకు సరిపడా యూరియాను ఒకేసారి అందించలేక పోతున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. కేటాయింపుల ప్రకారం యూరియాను రాష్ట్రానికి సరఫరా చేయక పోవటంతో లోటు ఏర్పడింన్నారు. హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ యూరియా కొరను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. హోల్ సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాములలో రోజువారి యూరియా స్టాక్ పర్యవేక్షించాలన్నారు. జిల్లా స్థాయిలో (District level) సమన్వయం చేసుకొని మండలాల వారీగా అవసరానికి సరిపడా కేటాయింపు చేయాలని సూచించారు. యూరియా సరఫరాలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పెద్ద రైతులకు విడతల వారిగా సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. అవసరమైతే పట్టాదారు పాసుపుస్తకాలు అనుసంధానం చేసి, టోకెన్లుతో ఎలాంటి గందరగోళం లేకుండా యూరియా సరఫరా చేయాలన్నారు. టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్రమ నిల్వలు, అధిక ధరలకు అమ్మకం, బ్లాక్ మార్కెటింగ్, ఆక్రమ రవాణా అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇతర అవసరాలకు యూరియా మళ్లించే అవకాశమున్న యూనిట్లపై తనిఖీలు చేసి నిల్వల్లో తేడాలుంటే కేసులు నమోదు చేయాలన్నారు. యూరియా సరఫరా సాధారణ స్థితికి చేరేవరకు కఠినంగా పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందులో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :