📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Urea App: యూరియా యాప్ లో కీలక మార్పులు

Author Icon By Pooja
Updated: March 7, 2026 • 10:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Urea App: హైదరాబాద్ : తెలంగాణలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా యూనిట్ గా యూరియా పంపిణీ జరగ్గా ఇక నుంచి మండలం లేదా రెండు మండలాలు లేదా నియోజకవర్గం ప్రాతిపాదికన యూరియా పంపిణీ జరగనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆ మేరకు యాప్ లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. యూరియా పంపిణీ సరిగ్గా నిర్వహించని ప్రైవేట్ డీలర్లపై కూడా తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Read Also: Errabelli Swarna: తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

Urea App: Key changes in the urea app

అయితే ఈ యాప్ వినియోగంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. స్లాట్ బుకింగ్ సరిగ్గా కాకపోవడం, దుకాణానికి వెళ్లినా అక్కడ నిల్వలు ఉండకపోవడం వంటి సమస్యలు ఎదురవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు. యూరియా పంపిణీ యాప్ను సులభంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల్లోని వ్యవసాయ అధికారులు సమస్యలపై సమాచారం సేకరించి విశ్లేషణ చేశారు. ప్రస్తుతం జిల్లా యూనిట్ గా యూరియా పంపిణీ జరుగుతుండగా రైతులు యాప్లో తమ జిల్లాల పరిధిలోని దుకాణాలను బుకింగ్ చేసుకుంటున్నారు. దీని కారణంగానే జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రద్దీ ఏర్పడుతోంది. యూరియా నిల్వలపై సమాచారం నమోదు అవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు జిల్లా యూనిట్ స్థానంలో మండలం లేదా నియోజకవర్గాల వారీగా పంపిణీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Farmers Telangana Urea App UreaDistribution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.