📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Today News : University – వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 24వ ర్యాంక్

Author Icon By Shravan
Updated: September 5, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

University : దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పనితీరుపై భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే నివేదిక ఎన్ఐఆర్ఎఫ్ (National Ranking) – 2025 గురువారం విడుదల అయ్యింది. ఈ జాబితాలో దేశం లోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల జాబితాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యా లయం 24వ ర్యాంక్ ను సాధించింది. 2015 లో పీజెటీఏయూ ఆరవ ర్యాంక్ సాధించగా, 2023లో ఆ ర్యాంక్ 37కు పడిపోయింది. ఇప్పుడు పనితీరు మెరుగుపరుచుకుని 24 ర్యాంకు సాధిం చిందని పీజెటీఏయూ ఉపకులపతి అల్దాస్ జానయ్య వివరించారు. దక్షిణాదిలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాల యాలు, సంస్థల్లో 4వ స్థానంలో పీజెటీఏయూ నిలవడం గర్వకారణమని జానయ్య అన్నారు.

ఉపకులపతి జానయ్య చర్యలు

10 నెలల క్రితం తాను పీజెటీఏయూ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ యేడాది ర్యాంకు మెరుగుపడిందని ఆయన తెలిపారు. విశ్వవిద్యా లయం పరిధిలో ప్రత్యేకంగా 4 ఆధునిక పరిశోధన కేంద్రాలు ప్రారంభించానన్నారు. సహజ వనరుల పరిరక్షణ, యూరియా, ఇతర రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, నీటి సమర్థ యాజమాన్యం వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఖిఖిరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని అమలుచేసి సుమారు 1200 గ్రామాల్లో 1,20,000 మంది రైతులని శాస్త్ర వేత్తలు ప్రత్యక్షంగా కలిసి ఆ అంశాలపై అవ గాహన కల్పించారని జానయ్య వివరించారు.

University – వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 24వ ర్యాంక్

భవిష్యత్ లక్ష్యాలు

అలాగే సుమారు 11వేల గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకి నాణ్యమైన 40 వేల విత్తన కిట్లను పంపిణీ చేశామని జానయ్య పేర్కొన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు నిరంతర మార్గదర్శకత్వం, తోడ్పాటుతో ఈ ర్యాంకు సాధించగలిగామన్నారు. అదేవిధంగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల కృషి, తోడ్పాటు ర్యాంకుల పెరుగుదలకు దోహదం చేసిందని జానయ్య అన్నారు. వారందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2026 లో 10వ ర్యాంకు, 2027లో 5వ ర్యాంకు సాధిస్తామని అల్ట్రాస్ జానయ్య ధీమా వ్యక్తం చేశారు.

పీజెటీఏయూ ప్రస్తుతం ఏ ర్యాంక్ సాధించింది?
పీజెటీఏయూ ప్రస్తుతం ఎన్ఐఆర్ఎఫ్-2025 ర్యాంకింగ్‌లో 24వ స్థానం సాధించింది.

భవిష్యత్తులో పీజెటీఏయూ ఏ ర్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది?
2026లో 10వ ర్యాంక్, 2027లో 5వ ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/handloom-weaver-card-with-qr-code-on-handloom-products-minister-savita/andhra-pradesh/541779/

Academic Excellence Agriculture University Breaking News in Telugu India Ranking Latest News in Telugu NIRF Ranking Research in Agriculture Telugu News Today Vice Chancellor Aldas Janayya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.