📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Suryapet: అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

Author Icon By Vanipushpa
Updated: February 7, 2026 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. వారికి బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు రాత్రీపగలు కష్టపడి పనిచేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకుని, వచ్చిన ఆదాయంలో సగానికంటే అధికంగా స్కూలు ఫీజులకోసం ఖర్చుపెడుతున్నారు. ఎందుకంటే తమ పిల్లలు చక్కగా చదువుకుని, ఉన్నతంగా ఎదగాలని. కానీ కొంతమంది యువత తల్లిదండ్రుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. చెడువ్యసనాలకు గురై, అమ్మాయిలతో ప్రేమను నడుపుతూ, చదువుకోవాల్సిన వయసులో అడ్డమైన పనులు చేస్తూ, తల్లిదండ్రుల పరువును తీస్తున్నారు. ఇందులో ఆడపిల్లలు కూడా తీసిపోవడం లేదు. కొంతమంది ఆడపిల్లలు తమ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో హాస్టల్ లో పెట్టి, చదివిస్తున్నారు. కానీ తమ పెరేంట్ కు దూరంగా ఉన్నామని, ఏమీ చేసినా వారికి తెలియదని, తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఇద్దరు అమ్మాయిలు అర్థరాత్రి హాస్టల్ నుంచి అబ్బాయిలతో వెళ్లిన విషయం కలకలం రేపుతున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

Read Also: TG Municipal Election: పవన్ ఎన్నికల ప్రచారం రద్దు

Suryapet: అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

సీసీఫూటేజ్ లలో రికార్డు.. వీడియో వైరల్

తెలంగాణలోని సూర్యాపేట(Suryapet) లో జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలు అర్థరాత్రి గేటు దాటిఅబ్బాయిలతో బైక్ లపై వెళ్లిపోయారు. ఆ బాలికలు తిరిగి తెల్లవారుజామున తిరిగి రావడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యింది. అసలు ఈ హాస్టల్ లో వార్డెన్ కానీ, వాచ్ మెన్ కానీ లేరా? గేటుకు తాళాలు వేయకుండా ఎలాగ ఉంటారు? అమ్మాయిలు ఉన్న హాస్టల్ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు? ఇందులో అమ్మాయిల తప్పు కూడా ఉంది. అబ్బాయిలతో ఒంటరిగా ఇలా బయటకు వెళ్లి, తెల్లవారుజామున తిరిగి రావడం అనేది ఏవిధంగా చూడాలి? చదువుకునే వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఏవిధంగా వస్తాయి? దీనిపై తగిన విచారణ చేసి, బాధితులపై చర్యలు తీసుకోవాలి. ఆడపిల్లలు ఉన్న హాస్టల్ లోని అమ్మాయిలకు ఏమాత్రం రక్షణ లేదని రాత్రిపూట పర్యవేక్షణలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఈ ఉదంతం తెలుపుతున్నది. అలాగే అర్ధరాత్రి బయటకు తీసుకెళ్లిన యువకులను కనిపెట్టి, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

law and order news local crime report midnight incident news police investigation update public safety issue suspicious activity report Telugu News Today women safety concerns

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.