📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

మీర్‌పేట్ మాధవి మర్డర్ కేసులో ట్విస్ట్

Author Icon By Sudheer
Updated: February 9, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సంక్రాంతి రోజు తన భార్య మాధవిని రిటైర్డ్ జవాన్ గురుమార్తి దారుణంగా హత్య చేశాడు. తన భార్య తలను గోడకేసి బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె శవాన్ని ముక్కలు చేసి, వాటిని వాటర్ హీటర్‌లో ఉడికించి, ఎముకలను పొడి చేసి చెరువులో పడేశాడని నిందితుడు పోలీసుల ఎదుట వెల్లడించాడు. ఈఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

పోలీసులు ఈ కేసును సైంటిఫిక్ ఆధారాలతో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతడిపై బీఎన్ఎస్ యాక్ట్ 103(1), 238, 85 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. గురుమార్తికి ఈ హత్యలో మరో ముగ్గురు కుటుంబ సభ్యులు సహాయపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

నిందితుడు గురుమార్తిని శనివారం నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. అతని దగ్గర నుంచి మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం తన భార్య మాధవి మిస్సింగ్ అయిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, తల్లిని కూడా మోసగించడం అతడి కుతంత్రానికి నిదర్శనం.

గురుమార్తికి గతంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడగా, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన మాధవి కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేయడంతో, భయపడిన అతను హత్యకు పాల్పడ్డాడు. తన భర్త నుంచి ఇలాంటి దారుణం ఎదురవుతుందని మాధవి ఊహించలేకపోయింది. ఈ కేసు ఇప్పటికీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మాధవి మృతదేహాన్ని పూర్తిగా మాయం చేయడం, పోలీసుల్ని మభ్యపెట్టేలా వ్యవహరించడం అతడి మానసిక స్థితిని తెలియజేస్తోంది. పరారీలో ఉన్న ముగ్గురు కుటుంబీకులను త్వరగా పట్టుకోవాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మాధవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Google news Meerpet Madhavi murder case twist

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.