Latest News: CP Sajjanar: ట్రాన్స్‌జెండర్ల వేధింపులపై ట్వీట్.. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?

Read Time:  1 min
 CP Sajjanar
 CP Sajjanar
FONT SIZE
GET APP

హైదరాబాదు (Hyderabad)లో ట్రాన్స్‌జెండర్‌ (transgenders) లు నుంచి ఎదురవుతున్న వేధింపులు, డబ్బుల వసూలు వంటి సమస్యలు ఇటీవల తీవ్రమైన రూపం దాల్చాయి.దీనిపై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నాయకుల అండతో ఈ వసూళ్ల పర్వం పరాకాష్ఠకు చేరిందంటూ ఒక నెటిజన్ X (ట్విట్టర్) వేదికగా నేరుగా పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.

Torrential rains: కుండపోత వర్షాలతో రైతాంగం విలవిల

నెటిజన్ చేసిన ఫిర్యాదులో.. నగరంలో ట్రాన్స్‌జెండర్ల ((transgenders))చర్యలు అదుపు తప్పాయని, వారు బహిరంగంగా రూపాయలు వేలు డిమాండ్ చేస్తూ.. ఇవ్వని వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి, కమిషనర్ సజ్జనార్‌ను ట్యాగ్ చేశారు.

 CP Sajjanar

ఈ ఫిర్యాదుకు సీపీ సజ్జనార్ (CP Sajjanar) స్పందించారు. ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు. దీనిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము అని ఆయన జవాబిచ్చారు. ఆరోపణలలోని నిజానిజాలను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటిని ధృవీకరించిన తర్వాత చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన  (CP Sajjanar)హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.