📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

టన్నెల్ ఘటన..ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం గుర్తింపు !

Author Icon By sumalatha chinthakayala
Updated: March 9, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ : 16 రోజుల ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ లో కీలక అప్డేట్ వచ్చేసింది. టీబీఎం మెషీన్ ముందు భాగంలో మృతదేహాం ఆనవాళ్లు కనుగొనింది రెస్క్యూ టీం. కుడి చెయ్యి, ఎడమ కాలు భాగాలను గుర్తించారు రెస్క్యూ టీం. చేతికి కడియం ఉండడంతో ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకి తీసే అవకాశం ఉంది. దీంతో కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్‌లో జేసీబీని ఉపయోగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు.

టన్నెల్ మెుత్తం పొడవు 14కి.మీ

ఇక అటు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ముక్క‌లు ముక్క‌లుగా టీబీఎం మిష‌న్‌ వస్తోంది. మిష‌న్‌ను క‌ట్టర్‌తో క‌ట్ చేశాయి రెస్క్యూ టీమ్స్‌. మిష‌న్ పార్ట్‌ల‌ను బ‌య‌ట‌కు పంపిస్తున్నారు స‌హాయ‌కులు. ఈ ప్ర‌క్రియ పూర్తియితే కార్మికుల ఆచూకీపై కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఛాన్సు ఉంది. టన్నెల్ మెుత్తం పొడవు 14కి.మీ కాగా.. 13.950 మీటర్ల వరకు క్లియర్‌గా ఉందన్నారు. జీరో పాయింట్ వద్ద చివరి 50 మీటర్లు సంక్లిష్టంగా ఉందని చెప్పారు. చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసేవారికి కూడా ప్రమాదమేనని అన్నారు.

మరోసారి ప్రమాద ఘటన, సహాయక చర్యలపై రివ్యూ

కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకచోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. రెస్క్యూలో భాగంగా రోబోల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామన్నారు. ఈనెల 11న ముఖ్యమంత్రి స్థాయిలో మరోసారి ప్రమాద ఘటన, సహాయక చర్యలపై రివ్యూ ఉంటుందని చెప్పారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంది. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. అయితే ఆనవాళ్లు లభించడాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కాసేపట్లో పూర్తి స్థాయి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

Breaking News in Telugu Engineer Gurpreet Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online tunnel accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.