📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Tummala Nageswara Rao: అవసరానికి మించి రైతులు యూరియా కొనవద్దు: తుమ్మల నాగేశ్వరరావు

Author Icon By Sharanya
Updated: August 18, 2025 • 10:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా అమ్మకాలపై నిరంతరం నిఘా ఉంచాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు (Tummala Nageswara Rao) సూచించారు. యూరియా (Urea) ను వ్యవసాయానికి కాకుండా, ఇతర ఆవస రాల కోసం మళ్లించకుండా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Tummala Nageswara Rao

5.32 లక్షల టన్నుల యూరియా సరఫరా

హైదరాబాద్లోని సచివాలయంలో మాట్లాడుతూ అవసరాలకు మించి యూరియాను కొనుగోలు చేయడం మానుకోవాలని రైతులకు సూచించారు. రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. కేంద్రం కేటాయించిన 9.80 లక్షల టన్నుల యూరియాలో ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల టన్నుల యూరియాను మాత్రమే సరఫరా వేసిందని, దీంతో 2.69 లక్షల టన్నుల లోటు ఏర్పండిందని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (Ramagundam Fertilizer Factory) లో 78 రోజులు ఉత్పత్తి జరగకపోవటం వలన రాష్ట్రానికి సరఫరా కావాల్సిన యూరియాలో పెద్ద లోటు ఏర్పడిందని అన్నారు. అంతేకాకుండా దిగుమతి ద్వారా కావాల్సిన యూరియాలో, కొన్ని నెలలలో కొన్ని కంపెనీలు అసలు సరఫరాలే చేయలేడన్నారు.

ఇతర రాష్ట్రాలలో కూడా యూరియా కొరత

రాష్ట్రంలోనే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్, హర్యాన, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో సీజన్ ముందుస్తుతో మొక్కజొన్న లాంటి పంటలు అధికంగా సాగు వేయడం వల్ల ఈ సంవత్సరం గతం కంటే యూరియా అమ్మకాలు అధికంగా జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నల్గొండ, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లాంటి జిరాల్లో గత సంవత్సరంతో పోలిస్తే అధికంగా అమ్మకాలు జరిగినట్టు తెలిపారు. ప్రతి నౌక నుండి ఆదనంగా 20 వేల టన్నుల యూరియాను కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులకు లేఖలు రాయాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి నండర్రావు, డైరక్టర్ గోపి గారు, హెచ్ఎసీఎ, మార్క్ ఫెడ్, ఆగ్రోస్ ఎంపీలు చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, రాము లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telangana-heavy-rain-24-hours-warning/telangana/531757/

agriculture news Breaking News Farming Tips Fertilizer Advisory latest news Telangana Farmers Telugu News tummala nageswara rao Urea Fertilizer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.