హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు పండించిన మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తెలిపారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కొను గోలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ మేరకు దీనికి సంబంధించి గురువారం ఒక ప్రకటనలో రాష్ట్రంలో 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, సగటున ఎకరాకు 18.50 క్వింటల్ దిగుబడి వచ్చి, మొత్తం 11.56 లక్షల టన్నుల దిగుబడి అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
Read Also: Raja Saab: ప్రభాస్ మాస్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్
ఇందులో 8.66 లక్షల టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుం దని అంచనా వేశామన్నారు (Tummala Nageswara Rao). ఇందుకు గాను ప్రభుత్వంపై 2,400 కోట్ల రూపాయల భారం పడుతుందని వెల్లడించారు. గత నెల 3 వ వారం నుండే మార్కెట్లోకి భారీగా మొక్కజొన్న పంట రావడం వలన ధరలు తగ్గిపోయాయని వివరించారు. ప్రస్తుత మార్కెట్ ధరలు మద్దతు ధర క్వింటాలుకు 2,400 రూపాయలు ఉండగా, దానికన్నా 441 రూపాయలు తక్కువగా ఉందని చెప్పారు. దీని వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతులు మొక్కజొన్నను(Corn) కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, మద్దతు ధర పొందవలసిందిగా సూచించారు. తక్కువ ధరలకు ప్రైవేట్లో కాకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని కోరారు. గతేడాది కేంద్రం మద్దతు ధరకు సేకరించనప్పటికి రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు 535 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందన్నారు. అదేవిధంగా పెసర, మినుము, సోయాచిక్కుడు, కంది, వేరుశనగ లాంటి పంటలపై కేంద్రం 25 శాతం సీలింగ్ విధిం చిందని ఇది రైతులకు అడ్డంకిగా మారు తుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :