Tummala Nageswara Rao: రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేవలం రెండేళ్లలోనే రూ. 1,09.400 రైతు సంక్షేమానికి ఖర్చు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికల నమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తూ ఆర్థిక స్థితిని మెరుగుపర్చడం, వ్యవసాయాన్ని బాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతు కేంద్రిత పాలన ఎలా ఉండాలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి చూపుతోందని స్పష్టం చేశారు.
Read Also ; Tamil Nadu Elections : తమిళనాడులో AIADMKదే పైచేయి?
రైతు సంక్షేమం పేరుతో నినాదాలు మాత్రమే చేసిన గత పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఫలితాల ఆధారంగా రైతు సంక్షేమం పని చేస్తోందన్నారు. మాటలు కాదు, పనులతో రైతు పక్షపాతి అని నిరూపించిన ప్రభుత్వం కాంగ్రెస్సేని పై స్పష్టం చేశారు. రైతు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ప్రతివక్షాలకు లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం పథకాలు ప్రకటించి, అమలులో పూర్తిగా విఫలమై రైతులను అప్పుల వారిన పడే చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. 2014, 2018లో లక్ష వరకు రుణమాఫీ పేరుతో మోసపూరిత ప్రకటనలు చేసిందని మండిపడ్డారు.

ఫలితంగా రైతులపై రైతులపై 2014-18 కాలంలో రూ.2630 కోట్లు, 2018 23 కాలంలో రూ.8515 కోట్ల వడ్డీభారం మోపిన దారుణాన్ని రైతులు మర్చిపోలేదన్నారు. కానీ కాంగ్రెస్ నూట తప్పకుండా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట రూ.2 లక్షల లోపు రుణాలను మొదటి పంట కాలంలోనే, ఒకే దఫాలో మాఫీ చేసి లక్షలాది రైతు కుటుంబాలను రుణవిముక్తం చేసిందని వివరించారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో సమర్పించిన నివేదికతో తేటతెల్లమైందని గుర్తు చేశారు. రైతుబంధు పేరుతో ప్రచారం చేసి, సమయానికి నిధులు విడుదల చేయకుండా రైతులను నిరాశలో ముంచిన బీజర్ఎస్ నేతలు ఇప్పుడు రైతు సంక్షేమంపై మాట్లాడటం హాస్యాస్పదమని తుమ్మల అన్నారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 9 రోజుల్లోనే రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి, ఇది నిజమైన రైతు ప్రభుత్వం అని పోటి చెప్పిందన్నారు.
రైతుబంధు పేరుతో కేంద్ర పథకాలను పూర్తిగా పక్కనపెట్టి, దాదాపు రూ. కోల్పోయేలా చేసిన దారుణానికి బాధ్యత ఎవరిది 3,000 కోట్ల విలువైన ప్రయోజ నాలను రైతులు అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. వ్యవ సాయ యాంత్రీకరణను నిలిపి వేయడం, పంట భీమాను నిరక్ష చేయడం, నష్టపరిహారం ఇవ్వకపోవడం, విత్తన సబ్సిడీ నిలిపివేయడం, పంటలు కొనుగోళ్ల బాధ్యత నుండి వైదొలగడం ఇవి అన్నీ రైతులను నష్టాల్లోకి నెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలని అగ్రహం వ్యక్తం ఖర్చు చేసి ఆధునిక సదుపాయాలు కల్పిస్తూ. రైతులకు కల్పిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోదాముల సామార్థ్యాన్ని మరో 4,53,400 మెట్రిక్ టన్నులకు పెంచేలా 38 గోదాముల నిర్మాణం చేపట్టిందని చెప్పారు.
కోహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి భారీ ప్రాజెక్టులు రైతు భవిష్యత్తుకు పునాది వేస్తాయని తెలిపారు. వ్యవసాయ విద్య, ఉద్యోగాల విషయంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరక్ష్యo చూపిందని ఆయన మండిపడ్డారు. సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయకుండా వ్యవస్థను బలహీనపరిచిందని. విమర్శించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో విఫలమైన ప్రతిపక్షాలు, ఇప్పుడు రైతులు పేరుతో రాజకీయాలు చేసి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :