హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) గుడ్‌న్యూస్ అందించింది. టెక్ ఉద్యోగులు ఆఫీసులకు త్వరగా, సులభంగా చేరుకునేలా ప్రత్యేక బస్సు సేవలను ప్రారంభించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ దిశగా ఈ స్పెషల్ బస్సులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తిరగనున్నాయి.
Read Also: TS Govt: విద్యుత్ శాఖ ఉద్యోగులకు డీఏ పెంపు
‘గర్‌లక్ష్మి ఇన్ఫోబాన్’ పేరుతో ఈ ప్రత్యేక బస్సు సేవలను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటీ కారిడార్‌కు వెళ్లే ఉద్యోగులకు అనుకూలంగా కొత్తగా రెండు రూట్లలో ఈ బస్సులను ప్రవేశపెట్టింది. ఎల్‌బీ నగర్, హయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి ఐటీ హబ్‌కు నేరుగా కనెక్టివిటీ కల్పించనుంది.
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల(TSRTC) ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు నిరంతరం సేవలందిస్తాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఒకటి లేదా రెండు బస్సులు మారాల్సిన అవసరం లేకుండా నేరుగా తమ ఆఫీసులకు చేరుకునే అవకాశం ఉంటుంది.
కొత్తగా ప్రారంభమైన రూట్లు
156/316 రూట్ బస్సులు ఎల్‌బీ నగర్ నుంచి ప్రారంభమై కోఠి, మెహిదీపట్నం, లంగర్‌హౌస్, నార్సింగ్, కోకాపేట, గర్, కాంటినెంటల్ సర్కిల్, ఐసీఐసీఐ, ఐఐఐటీ ప్రాంతాల మీదుగా గచ్చిబౌలికి చేరుకుంటాయి. 300/316 రూట్ బస్సులు హయత్ నగర్ నుంచి బయలుదేరి ఎల్‌బీ నగర్, సాగర్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, హైదర్ గూడ, నార్సింగ్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, వేవ్‌రాక్, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్ మీదుగా గచ్చిబౌలి వరకు ప్రయాణిస్తాయి.
ఇప్పటికే ఐటీ ఉద్యోగుల కోసం పలు ప్రత్యేక బస్సులను నడుపుతున్న టీఎస్ ఆర్టీసీ, ఈ కొత్త రూట్లతో మరింత కనెక్టివిటీ పెంచింది. మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలకు, అధిక క్యాబ్ ఛార్జీలకు ప్రత్యామ్నాయంగా తక్కువ టికెట్ ధరలతో ఈ బస్సులు ప్రయోజనకరంగా మారనున్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఐటీ కారిడార్ వైపు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల ఐటీ ఉద్యోగులకు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఖర్చు కూడా ఆదా కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: