TS TET results 2026 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) జనవరి–2026 ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ మంగళవారం అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం 51.37 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఫలితాలు ఈసారి ప్రత్యేకంగా చర్చకు దారితీశాయి.
తాజా ఫలితాల ప్రకారం టెట్‌కు హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 57.76 శాతం మంది అర్హత సాధించారు. సంఖ్యాపరంగా చూస్తే 37,893 మంది ప్రభుత్వ టీచర్లు టెట్‌ను క్లియర్ చేశారు. ఇతర అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 48.14 మాత్రమే ఉండగా, ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరు మెరుగ్గా ఉన్నప్పటికీ, వేల సంఖ్యలో టీచర్లు విఫలమవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం పరీక్ష రాసిన 1,95,181 మందిలో 1,00,270 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
Read Also: AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల
ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ తప్పనిసరిగా పాస్ కావాలని గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టెట్ ప్రవేశపెట్టకముందు నియమితులైన ఉపాధ్యాయులు రెండేళ్ల గడువులోపు అర్హత సాధించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. ఈ గడువు లోపే టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
అయితే ఈసారి టెట్‌లో అర్హత సాధించలేకపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంకా అవకాశం మిగిలే ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయించిన రెండేళ్ల గడువులో జరిగే తదుపరి టెట్ పరీక్షల్లో వారు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్‌కు జీవితకాల వ్యాలిడిటీ ఉండటంతో పాటు, భవిష్యత్తులో జరిగే టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ)లో 20 శాతం వెయిటేజీ లభించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: