తెలంగాణ రాష్ట్రంలో(TS Govt) విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. విద్యుత్ శాఖ పరిధిలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతీ సంవత్సరం ఇచ్చే కరువు భత్యం (డీఏ)ను 17.651 శాతం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డీఏ పెంపు జూలై 1, 2025 నుంచి అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Christmas Holidays: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు
మార్కెట్‌లో ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలుపడంతో సంబంధిత శాఖలు ఉత్తర్వులు విడుదల చేశాయి. తాజా నిర్ణయంతో విద్యుత్ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో లబ్ధి పొందనున్నారు.
ఈ డీఏ పెంపు వల్ల విద్యుత్ శాఖకు(TS Govt) చెందిన మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. అన్ని సంస్థల్లో సమానంగా ఈ పెంపు వర్తింపజేయనున్నారు.
సంస్థల వారీగా డీఏ పెంపుతో లబ్ధి పొందే వారి సంఖ్య
టీజీ ట్రాన్స్‌కో (TG TRANSCO):
ఈ సంస్థలో పనిచేస్తున్న 3,036 మంది ఉద్యోగులు, 3,769 మంది ఆర్టిజన్లు, 2,446 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 9,251 మందికి లబ్ధి చేకూరనుంది.
జెన్‌కో (GENCO):
జెన్‌కో పరిధిలో 6,913 మంది ఉద్యోగులు, 3,583 మంది ఆర్టిజన్లు, 3,579 మంది పెన్షనర్లకు డీఏ పెంపు ప్రయోజనం అందనుంది.
టీజీ పీడీసీఎల్ (TGPDCL):
ఈ సంస్థలో 11,957 మంది ఉద్యోగులు, 8,244 మంది ఆర్టిజన్లు, 8,244 మంది పెన్షనర్లు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు.
ఎన్‌పీడీసీఎల్ (NPDCL):
ఎన్‌పీడీసీఎల్‌లో పనిచేస్తున్న 9,728 మంది ఉద్యోగులు, 3,465 మంది ఆర్టిజన్లు, 6,115 మంది పెన్షనర్లకు డీఏ పెంపు వర్తించనుంది.
మొత్తంగా విద్యుత్ శాఖలోని అన్ని సంస్థలను కలిపి 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ డీఏ పెంపు ద్వారా ఆర్థిక ఊరట లభించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: