TS Budget 2026-27 : రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్ (2026-27)లో నిధుల కేటాయింపులు జరగనున్నట్లు తెలుస్తోంది. వేల కోట్లు ఖర్చు చేసినా గడిచిన పదేళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేలా నీటిపారుదలశాఖకు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత దక్కనుంది. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులను ముందుగా గుర్తించి, వాటికి తక్షణమే నిధులను విడుదల చేసేలా ఒక ప్రాధాన్యతా క్రమాన్ని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్
ప్రాధాన్య ప్రాజెక్టులకు తగినంత మేర నిధుల కేటాయింపు చేసేలా కసరత్తు పూర్తికావొస్తోంది. ప్రాజెక్టుల నిర్వహణ, కాల్వల మరమ్మతులకు సైతం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో గోదావరి జలాలను ఎత్తైన ప్రాంతాలకు అందించాలనే మహత్తర లక్ష్యంతో ప్రారంభమైన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరోసారి బడ్జెట్ సీజన్లో చర్చకు కేంద్ర బిందువుగా మారింది.
లభ్యమయ్యే వరద జలాలను వినియోగించి
గోదావరి నదిలో లభ్యమయ్యే వరద జలాలను వినియోగించి వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి వంటి ఎత్తైన జిల్లాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నీటిని పలు దశల్లో ఎత్తిపోతల ద్వారా పైభాగాలకు తరలించే విధంగా రూపకల్పన చేసిన ఈ పథకం సాంకేతికంగా క్లిష్టమైనది. భారీ పంప్ హౌసులు, సుదీర్ఘ పైడ్లైన్లు, కాల్వల నిర్మాణం, పంపిణీ వ్యవస్థలతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రధాన లక్ష్యం. ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలంటే తక్షణమే రూ.4,312 కోట్ల విడుదల అవసరమని ఇంజినీరింగ్ వర్గాలు సూచిస్తున్నాయి.
ఒకేసారి పూర్తిస్థాయి నిధులు విడుదల చేస్తేనే పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉన్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 91 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో ప్రాధాన్యత లభించబోతోందని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా… నీటిపారుదలశాఖకు ఈ బడ్జెట్లో ఏకంగా రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని తొలుత చీఫ్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఆ మొత్తాన్ని ఇంజనీర్ ఇన్చీఫ్ స్థాయిలో రూ.45 వేల కోట్లకు కుదించారు. 2026-27లో ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులు వాటి వివరాలను ఆర్థిక శాఖకు అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: