📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Today News : Tragedy : వినాయక నిమజ్జనంలో ఇద్దరు మృతి.. మరో ఏడుగురికి గాయాలు

Author Icon By Shravan
Updated: September 2, 2025 • 5:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tragedy : ఇటిక్యాల మండల కేంద్రంలో ప్రతిష్టించిన గణనాధుని నిమజ్జనం చేసేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో గణనాథుని ట్రాక్టర్ ను డీసీఎం వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అలాగే మరో ఏడుగురు కు గాయాలు తగలడంతో వినాయక నిమజ్జనం (Ganesha immersion) విషాదాంతంగా మారడంతో ఇటిక్యాల మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా ఉండగా ఇటిక్యాల ఎస్సై కే రవి కథనం మేరకు మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయం వద్ద గణనాధుని ప్రతిష్టించగా 5 రోజులపాటు భక్తుల నుండి పూజలు అందుకున్న గణనాధుని 12 కిలోమీటర్ల దూరం ఉన్న బీచుపల్లి కృష్ణా నదిలో నిమజ్జనం చేసేందుకు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో గ్రామం నుండి బయలుదేరగా అర్ధరాత్రి (Midnight) సమయంలో 44వ నెంబర్ జాతీయ రహదారి కొట్టం ఇంజనీరింగ్ కాలేజీ సమీపము స్మశాన వాటిక వద్ద వెనుక నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఏపీ 39 వి.ఈ. 2898 గల డీసీఎం వాహనం గణనాథుని తీసుకెళ్తున్నా ట్రాక్టర్ ను డీసీఎం డ్రైవర్ అతివేగం అజాగ్రత్త వల్ల బలంగా ట్రాక్టర్ ను ఢీకొనడంతో అందులో ఉన్న జమ్మన్న (50) సంవత్సరాలు ఆక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన నరసింహుడును ( 48) అంబులెన్స్ లో చికిత్స కోసం తరలించగా మృతి చెందాడు.

Tragedy : వినాయక నిమజ్జనంలో ఇద్దరు మృతి.. మరో ఏడుగురికి గాయాలు

అదే ట్రాక్టర్ లో ఉన్న మరో 7గురు వ్యక్తులు జ్ఞానేశ్వర్ టీ. నరేందర్. సి.మహేందర్. కె రమేష్. బి రాముడు. కే యశ్వంత్. సి మధులకు గాయాలు కాగా అంబులెన్స్ లో వీరిని చికిత్స కోసం గద్వాల కర్నూలు ఆసుపత్రులకు తరలించినట్లు మృతుడు జమ్మన్న భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై కే రవి తెలిపారు.. సమాచారం అందుకున్న ఇటిక్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/urea-1-09-lakh-metric-tons-supplied-to-the-state/andhra-pradesh/539957/

Breaking News in Telugu Ganesh festival 2025 Ganesh immersion accident Latest accident news Latest News in Telugu Telugu News Today Tragedy News Vinayaka Nimajjanam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.