హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాలను (Road accidents) నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా జంట నగరాలలో ఓవైపు డ్రంకన్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవ్లను అడ్డుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేబట్టిన ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) తాజాగా లైసెన్స్లు లేకుండా వాహనాలు నడిపే వారిని నిలువరించేందుకు దాడులు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాలలో జంట నగరాల వాటా తక్కువగానే వున్నా నగరంలో జరిగే ప్రమాదాల్లో మృతుల సంఖ్య నాలుగు వందలకు పైగానే వుండడం గమనార్హం. ఇందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా వుంటున్నారు. వీరిలో ప్రమాదాల సమయంలో హెల్మెట్లు ధరించనివారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నవారు, రాంగ్ సైడ్ డ్రైవ్లో వస్తున్నవారు, పాదచారులు ఎక్కువగా వున్నారు. ఇందులో పాదచారుల మరణాలను పూర్తిగా ఆపేందుకు అనేకచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించగా మరికొన్నిచోట్ల నిర్మాణంలో వున్నాయి. పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్లు దాటకుండా వుండేందుకు రహదారుల మధ్యన ఎత్తైన నిర్మాణాలు చేబట్టారు.
Read Also: Digital Agriculture: ఒక్క క్లిక్ తో పొలం వద్దకే యంత్రాలు
పట్టుబడుతున్న వారికి భారీగా జరిమానాలు, వాహనాలను జప్తు
ఇవి పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్లను దాటకుండా నిలువరిస్తున్నాయి. ఇక ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్లు ధరించేలా చేసేందుకు పోలీసులు తమ వంతుగా ప్రయత్నంచేస్తున్నారు. ఇక ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్పై పోలీసుల స్పెషల్ డ్రైవ్ రెండు నెలలుగా నిరంతరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టుబడుతున్న వారికి భారీగా జరిమానాలు విధిస్తూ కొన్ని రోజుల పాటు వాహనాలను జప్తు చేస్తునా ్నరు. రోడ్డు ప్రమాదాల మరణాలకు ఈ రెండు అంశాలు కూడా కారణమవుతున్నాయి. దీంతో పాటు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా సరైన పద్ధతిలో డ్రైవింగ్ చేస్తున్న వారు కూడా అనేక సందర్భాలలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో తమ తప్పులేకున్నా చాలా మంది మరణిస్తుండడం లేదా గాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు పోలీసులు మరింత కఠినంగా వుండాలని నిర్ణయించారు.
లైసెన్స్ సమస్యల కారణంగా బీమా నష్టపరిహారం రాదు
వీటికి తోడు గా లైసెన్స్లు లేకుండా వాహనాలు నడిపే వారివల్ల జరుగుతున్న ప్రమాదాలను పూర్తిగా నివారించాలని పోలీసులు (Traffic Police) నిర్ణయించారు, సాధారణంగా లై సెన్స్లు లేకుండా వాహనాలు నడిపే వారిలో మైనర్లే ఎక్కువగా వుండడం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో మహిళలతో పాటు యువకులు కూడా చేరిపోయారు. ఉదాహరణకు టూ వీలర్ లైసెన్స్ పొంది ఫోర్ వీలర్లు నడుపుతున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా వుంటోంది. ఈ విషయంలో మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే వుండడం ఆందోళనగా మారిందని పోలీసులు అంటున్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారు ఒక రకమైన లైసెన్స్లు వుండి మరోరకం వాహనం నడిపే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారు, ఒక రకమైన లైసెన్స్ వుండి మరో రకం వాహనం నడిపే వారి వల్ల ప్రమాదాలు సంభవించిన సమ యంలో ఎవరైనా తులకు బీమా కంపెనీలు నష్ట పరి హారం అందడం లేదు.
ఈ విషయంలో బీమా కంపెనీలు కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నాయని పోలీసులు అంటున్నారు. దీని కారణంగా రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరగడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారు, ఒక రకమైన లైసెన్స్లు వుండి మరో రకం వాహనం నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణ యించారు. ఈ విషయంలో ఇప్పటికే మొదలైన స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డవారికి రవాణా చట్టం అనుసరించి భారీ గా జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను జప్తు చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ రెండు నెలల పాటు కొనసాగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: