నకిలీ ఈ-చలాన్ (E-Challan) చెల్లింపు లింకులు ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ హెచ్చరిక జారీ చేసింది. తెలియని సైబర్ నేరగాళ్లు “మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి” అంటూ SMS లేదా WhatsApp సందేశాల ద్వారా నకిలీ లింకులను పంపిస్తూ, వెంటనే చెల్లింపు చేయాలని ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ వీ అరవింద్ బాబు ఓ ప్రకటన ఇచ్చారు. మోసపూరిత లింకును క్లిక్ చేసినప్పుడు, వాహన రిజిస్ట్రేషన్ నంబరును అడిగి చలాన్ మొత్తాన్ని చూపుతారు.
Read Also: Kalvakuntla Kavitha: BRSలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు
అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల ద్వారా మాత్రమే చేయాలి
చెల్లింపులు చేసేటప్పుడు మొబైల్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది లేదా బ్యాంకింగ్ వివరాలు చోరికి గురి అవుతాయి. ఫలితంగా- అనధికార లావాదేవీలు, మొబైల్ హ్యాకింగ్‌కు దారితీసే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ చలాన్లను అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల ద్వారా మాత్రమే చేయాలని సూచించారు.ప్రభుత్వ విభాగాలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింక్‌లను ఎప్పటికీ పంపబోవని వివరించారు.ఓటీపీ, యూపీఐ పిన్, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వెబ్‌సైట్‌లలో పొందుపర్చవద్దని,
యాప్‌లను అధికారిక ప్లేస్టోర్ నుండి మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్‌ను ఎప్పుడూ భద్రతా ప్యాచ్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్‌లో ఉంచాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే మొబైల్ డేటా/వైఫై డిస్‌కనెక్ట్ చేసి బ్యాంకులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. లావాదేవీలు/కార్డులను బ్లాక్ చేయాలి. 1930కు డయల్ చేయాలి. www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని, లేదా దగ్గర్లోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: