తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Telangana PCC President Mahesh Kumar Goud) తన భూమిని గ్రామాభివృద్ధి కోసం భూమిని విరాళంగా ఇచ్చి మంచి మనసును చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) లోని తన స్వగ్రామం రహత్ నగర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు పది ఎకరాలు, సబ్ స్టేషన్ కోసం ఎకరా తన స్వంత భూమిని విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు.
Read Also: Puttaparthi: ఘనంగా పుట్టపర్తి శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు
ఈ క్రమంలోనే టెంపుల్ కారిడార్ ను తన గ్రామం మీదుగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం స్వగ్రామమైన రహత్‌నగర్ లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
భారీ గజమాలతో గ్రామ ప్రజలు టీపీసీసీ చీఫ్ (Telangana PCC President Mahesh Kumar Goud) ను సత్కరించారు. గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ గ్రామంలో దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించిన విషయాన్ని స్మరించుకున్నారు. అనంతరం ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులతో కలిసి పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు ధన్యవాదాలు
ధర్మపురి నుంచి తన స్వగ్రామం రహత్ నగర్ మీదుగా బాసర వరకు టెంపుల్ కారిడార్ కోసం తాను చేసిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్ ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబద్రిగుట్ట మీదుగా బాసర కి వెళ్తుంది.
అయితే తన గ్రామం రహత్ నగర్ మీదుగా రోడ్ మంజూరు కావడానికి తాను చేసిన కృషి ఫలించడం చాలా ఆనందంగా ఉన్నదని ఆయన (Mahesh Kumar Goud) అన్నారు. ఈ టెంపుల్ కారిడార్ రోడ్డు నిర్మాణానికి 380 కోట్ల రూపాయలతో రోడ్ నిర్మాణం పూర్తయితే చాలా అభివృద్ధి జరుగుతుందని పీసీపీ చీఫ్ అన్నారు.
గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి
బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మరిచిపోలేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని, పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదన్నారు. గ్రామంతో ఉన్న అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుందన్నారు.
గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని పీసీసీ ఛీఫ్ హామీ ఇచ్చారు. గ్రామానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య సౌకర్యాలు లభిస్తాయన్నారు. గ్రామ అభివృద్ధి చేయడం బాధ్యతగా భావిస్తున్ననని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: