తెలంగాణలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సానుకూల వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనేతలు డీజీపీ ముందు లొంగిపోయిన నేపథ్యంలో, వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్.. దశాబ్దాలుగా పేద ప్రజల కోసం, తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడిన మావోయిస్టుల పట్ల తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ, లొంగిపోయిన మావోయిస్టులు తమ పార్టీలోకి రావాలని కోరుకుంటే వారిని సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను తీవ్రంగా వ్యతిరేకించిన మహేష్ కుమార్ గౌడ్, ప్రధాని మోదీ వైఖరిని ఎండగట్టారు. పాకిస్థాన్ వంటి దేశాలతో చర్చలకు సిద్ధపడే ప్రధాని, స్వదేశీయులైన మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులు, కాంగ్రెస్ ఇద్దరూ అంతిమంగా పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని ఆయన విశ్లేషించారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ.. తెలంగాణ కోసం పనిచేసిన వారిని ఆ పార్టీ ఎప్పుడూ గౌరవించలేదని, మార్చి నెలలో అర్హులైన వారికి కార్పొరేషన్ పదవులు కట్టబెడతామని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :