📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Hyderabad: హైదరాబాద్‌లో టూరిస్టుల కోసం పర్యాటక కేంద్రం

Author Icon By Anusha
Updated: December 6, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఇప్పటికే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు నెలకుని ఉన్నాయి. భాగ్యనగర వాసులకు నిత్యం ఆహ్లాదాన్ని, సంతోషాన్ని పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు పార్కులను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలో కొత్వాల్ గూడలోని ఎకో పార్క్ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. అన్ని సౌకర్యాలతో 85 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంది. ఈ ఎకో పార్కులోనే అతి పెద్ద పక్షి శాలను నిర్మించారు. అలాగే దేశంలోనే అతిపెద్ద ఎక్వేరియం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.

Read Also: Shiv Raj Kumar: ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్‌

85 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఎకో పార్కు

(Hyderabad) కొత్వాల్ గూడ (Kotwal Guda) ఎకో పార్క్.. పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. పిల్లలు, పెద్దలు వారాంతాల్లో ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా ఈ పార్కును అభివృద్ధి చేశారు. ఔటర్ రింగ్‌ రోడ్డు పరిధిలోని హిమాయత్ సాగర్‌ పక్కన 85 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఎకో పార్కు (Eco Park) ను రూపొందించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన దాదాపు 15వందల రకాల పక్షులకు ఇక్కడ నిలయంగా ఉంది.

అలాగే ఇక్కడ సాహస క్రీడలను పెంపొందించేందుకు వీలుగా.. జిప్‌ లైన్, క్లైంబింగ్‌ వాల్‌, స్కై బ్రిడ్జి, రోలర్‌ కోస్టర్‌, జాయింట్‌ స్వింగ్, 360 డిగ్రీస్ ఫ్లయింగ్‌ సైకిల్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జి, బంగీ ట్రంప్‌ లైన్‌.. తదితర క్రీడలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వారాంతాల్లో యువత, పిల్లలు.. ఈ క్రీడలను ఆస్వాదించవచ్చు.

Tourist center for tourists in Hyderabad

పక్షుల జాతులు

ఈ కేంద్రం బర్డ్‌ వాచింగ్‌ (పక్షులను వీక్షించడం), నేచర్‌ ఎడ్యుకేషన్ (ప్రకృతి విజ్ఞానం), పక్షులపై అధ్యయనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లతో రూపొందించారు. గతంలో ఎప్పుడూ చూడని బ్లూ అండ్‌ గోల్డ్‌ మేకా, గ్రీన్‌ వింగ్‌ మేకా, స్కార్లెట్‌ మేకా వంటి రంగురంగుల మేకా పక్షులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కకాటో (Cockatoo), ఆఫ్రికన్‌ గ్రే ప్యారెట్, అమెజాన్‌ ప్యారెట్స్‌ వంటి తెలివైన చిలుకల జాతులు పర్యాటకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.

ఫించెస్ , లవ్‌బర్డ్స్‌ లాంటి చిన్న పక్షులు వేల సంఖ్యలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. కాకటీల్ , గ్రౌస్, ప్యారాకిట్స్, క్వేకర్‌ పారాకీట్స్‌ మృదువైన స్వరంతో పర్యాటకులను స్వాగతించనున్నాయి. రెయిన్‌బో లోరీకీట్‌లు, టుర్కో, టౌకాన్‌లు, మాండరిన్‌ డక్స్‌ వంటి పెద్ద ముక్కు పక్షులు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Himayatsagar attraction Hyderabad Tourism international bird park Kotwalaguda Eco Park latest news ORR Hyderabad Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.