Tolichowki Building Collapse: హైదరాబాద్ (HYD) నగరంలో టోలీచౌకీ ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిన ఒక విషాదకర ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనలో మరింత మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. టోలీచౌకీ అల్ హస్నాత్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: vote: ప్రజల ఓటు విలువ కోల్పోతుందా?
ఇక భవనం కూలిన ఘటనకు సంబంధించిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కొత్త భవనానికి గోవా కర్రలు కట్టి.. వాటిపై నిలబడి కార్మికులు పనులు చేస్తుండగా.. అకస్మాత్తుగా ఆ కట్టెలు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఎవరు, వారి వివరాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: