📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణకు వేళాయే

Author Icon By Sudheer
Updated: March 26, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు చివరి అంకం చేరుకుంది. ఏప్రిల్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రులను తన మంత్రివర్గంలోకి చేర్చనున్నారు. ఇందులో రెండు రెడ్డి సామాజికవర్గానికి, రెండు బీసీలకు, ఒక ఎస్సీకి మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థులకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.

రెడ్డి నేతలకు కీలక స్థానం

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి ఈ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిద్దరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తమ వంతు పాత్ర పోషించిన నేతలుగా చర్చించబడుతున్నారు.

బీసీ నేతల మధ్య పోటీ

బీసీ నేతలకు కేబినెట్‌లో రెండు స్థానాలు కేటాయించినప్పటికీ, ముగ్గురు నేతలు మంత్రిపదవి కోసం పోటీపడుతున్నారు. వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయమని, అయితే మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య పోటీలో ఉన్నారని సమాచారం. చివరి నిమిషంలో అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత

ఎస్సీ వర్గానికి ఒక మంత్రి పదవి కేటాయించనుండగా, వివేక్ పేరు దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో సామాజిక సమతుల్యతను పరిరక్షిస్తూ, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారు. ఏప్రిల్ 3న జరగనున్న ఈ మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

cm revanth Google News in Telugu New ministers Telangana cabinet

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.