హైదరాబాద్ : పెద్ద పులులు సంరక్షణలో కీలకపాత్ర పోషించే రేడియోకాలర్స్ (Radio collars) వినియోగంలో రాష్ట్ర అటవీశాఖ అంతకగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పులులు, చిరుతలు ఎక్కడైనా చిక్కినా లేదా ఏదైనా ఘటనలో దొరికినా వెంటనే వాటికి రేడి యో కాలర్స్ అమర్చి వాటిని కదలికలను గమనిస్తూ వాటి రక్షణ నిమిత్తం తగుచర్యలు తీసుకుంటారు. మహారాష్ట్రతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో వీటిని వినియోగం సమర్థవంతంగా ఉండగా రాష్ట్ర అటవీశాఖ మాత్రం వీటి వినియోగంపై అంతగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రేడియో కాలర్స్ ను పులుల (Tigers) కు అమర్చిన దాఖలాలు లేవని సమాచారం.ఇటీవల కాలంలో రెండు చిరుతలను పట్టుకోగా వాటికి ఈ రేడియో కాలర్స్ ను అమర్చలేదని తెలిసింది.
ఎవరైనా దాతలు ముందుకు వచ్చే అవకాశం
రేడియో కాలర్ ఖరీదు రూ.1 లక్షల నుంచి 1.50 వరకు ఉండగా ఆ మొత్తాన్ని వెచ్చించలేకనో ఇతర కారణాలతో వీటిని కోనుగోలు చేసేందుకు అధికారులు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. వీటి కోనుగోళ్లకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చే అవకాశం కోసం అధికారులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అమ్రాబాద్లో టైగర్ సంఖ్య 38కి చేరుకోగా, అక్కడ పులుల వృద్ధికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదే కవ్వాల్ టైగర్ రిజర్వు రిజర్వులో ఒక్క రెసిడెంట్ (టైగర్ స్థిర నివాసం ఏర్పరుచుకున్న పులి) కూడా లేక పోవడం గత పదేళ్ళలో ఈ ప్రాంతంల మూడు నాలుగు, పులులు వేటగాళ్ళ ఉచ్చులకు బలికావడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా గతంలో పట్టుపడిన పులలు రక్షణ చర్యలతో పాటు వాటి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తదనుగుణంగా చర్యలు అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ శాఖ ప్రజలకు ఎలా సేవలందిస్తుంది?
అడివి భూముల రక్షణ, పర్యావరణ సౌరభం,అడవి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా ప్రజలకు పర్యావరణ సేవలు అందిస్తుంది.
అటవీ శాఖకు సంబంధించిన ముఖ్య చట్టం ఏమిటి?
భారతదేశంలో ప్రధానంగా ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ చట్టాలు (Forest and Wildlife Acts) ప్రకారం అటవీ శాఖ కార్యకలాపాలు నడుస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: