రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు(Thummala NageswaraRao) రాష్ట్రం మార్క్ పెట్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తో కలిసి నంగునూరు మండలం నర్మెటాలో గల ఆయిల్ఫడ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించారు.
Read Also:Tiger: సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం
ఈ సందర్భంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్:-
ఈనెల చివరిలో గాని వచ్చే నెల మొదటి వారంలో గాని రాష్ట్ర ముఖ్యమంత్రి(Thummala NageswaraRao) చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించాము. చిన్నచిన్న పనులు మరియు క్లీనింగ్ తప్ప దాదాపు పనులు పూర్తయ్యాయి. నాలుగు మెగావాట్ల కెపాసిటీ గల ఆయిల్ ఫామ్ పిప్పి తో కూడిన వ్యర్థాలతో విద్యుత్ జనరేషన్ చేసే ప్లాంట్ కూడా పూర్తవుతుంది. పనులు మొత్తం పూర్తిగా గానే ఫ్యాక్టరీ ప్రారంభించడానికి ముఖ్యమంత్రి సమయం కోరుతా.
ఫ్యాక్టరీ లోనే మూడు రోజులపాటు రైతు మేళ నిర్వహించి
ఆయిల్ ఫామ్ పంటలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేసి వ్యవసాయ యాంత్రికరణ, అదునాతన వ్యవసాయ పద్ధతులపై ప్రదర్శన మరియు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులచే రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. 120 మెట్రిక్ టన్నుల వరకు గెలలను ప్రాసెస్ చేసే అవకాశం ఉన్న ఈ ఫ్యాక్టరీ ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా మారుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పండిన ఆయిల్ ఫామ్ పంటను ఇక్కడ ప్రాసెస్ చేసే కెపాసిటీ ఈ ఫ్యాక్టరీ కి ఉంది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన సంతకం పెట్టిన. కటిన్నర సంవత్సరంలోనే ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేశాము.
ఆరోజు ఆయిల్ ఫామ్ గెల ఒక మెట్రిక్ టన్నుకు 12000 రూపాయలు మాత్రమే ఉండే ఇప్పుడు 24,456 రూపాయలుగా పెరిగింది. మన రాష్ట్రంలో నిర్ణయించే ఆయిల్ ఫామ్ గెలల ధరనే దక్షిణ భారత దేశంలో అమలవుతుంది. రాష్ట్రంలో మూడు, నాలుగు సంవత్సరాల నుండి ఆల్ఫా మొక్కలను పెట్టడం జరిగింది అవి కోతకు రాగానే ఫ్యాక్టరీ అందుబాటులో ఉండాలని వేగంగా నిర్మించడం జరిగింది. ముఖ్యమంత్రి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతోపాటు ఆయిల్ రిఫైనరీ యూనిట్ నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది.
దేశంలో ప్రస్తుతం 12 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతుంది. ఇంకా దేశంలో 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయవలసిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లాలో 14 నుండి 15 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతుంది. లక్ష కోట్ల రూపాయల విలువైన ఆయిల్ ను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. రైతులకు ఎలాంటి నష్టం కలగజేయని ఆయిల్ ఫామ్ పంటను పండించేందుకు ముందుకు రావాలి.
ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కామెంట్స్:-
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కొరకు పనుల పరిశీలనకు వచ్చాము. ఖమ్మంలో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ తోటను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆయిల్ ఫామ్ పంటలు పండిస్తున్నారు. రైతులకు ఎలాంటి మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నాము. ఎకరాకి లక్ష రూపాయల పైన ఆదాయం వచ్చే ఏకైక పంట ఇది. దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఫ్యాక్టరీ ఇది.
ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నాము. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డైరెక్టర్ మరియు ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ భాష, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, ఆయిల్ ఫెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయనైనది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: