📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి

Author Icon By sumalatha chinthakayala
Updated: February 21, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జిల్లాలోని బర్డ్ ఫ్లూ కలకలం

హైదరాబాద్‌: వనపర్తి జిల్లాలో ఏపీలో జరిగినట్లుగానే వనపర్తి జిల్లాలో జరుగుతోంది. వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. వనపర్తి జిల్లా మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో దాదాపు 15 వందల కోళ్లు చెందాయి. ఈ తరుణంలోనే వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కోళ్ల షెడ్లను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు పశుసంవర్ధక వైద్యులు.

నిలబడిన చోటనే క్షణాల్లో కుప్పకూలి కోళ్లు

కాగా, కోళ్లు మృతి చెందడంపై పశుసంవర్ధక శాఖ వైద్యులు అప్రమత్తమయ్యారు. వెను వెంటనే గురువారం పిన్నంచర్ల గ్రామంలోని కోళ్ల ఫామ్ లో ఉన్న 5వేల కోళ్ళల్లో దాదాపు వెయ్యికి పైగా కోళ్లు మృతి చెందాయి. నిలబడిన చోటనే క్షణాల్లో కుప్పకూలి కోళ్లు ప్రాణాలు కోల్పోవడం, కోళ్ల పరిశ్రమ నిర్వాహకులకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తుంది. కోళ్ల ఫామ్ లో ఉన్న మిగితా కోళ్లన్నీ కూడా మృతిచెందే అవకాశమున్నట్లు పశువైద్యుడు రమేష్ తెలిపారు. కోళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు సాంఫుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు ఆయన వెల్లడించారు. ల్యాబ్ రిపోర్ట్ అందే వరకు కోళ్ల ఫామ్ చుట్టూ రక్షణ చర్యలు చేపడుతామన్నారు.

కొన్ని వేల కోళ్లు మృత్యువాత

కాగా, గత కొద్ది రోజులుగా తెలంగాణ లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రోజుకు కొన్ని వేల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా ఒకేసారి 4వేల కోళ్లు మృతి చెందడం సంచలనంగా మారింది. వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శివకేశవ రెడ్డి అనే రైతుకు ఒక కోళ్లఫామ్ ఉంది. దానిని దాదాపు 5,550 కోళ్ల కెపాసిటీతో నిర్మించాడు. అందులో తాజాగా 4000 కోళ్లు మృతి చెందాయి.

బర్డ్ ఫ్లూ వ్యాప్తి – అధికారులు అప్రమత్తం

పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వనపర్తి జిల్లాలో కోళ్లు భారీ స్థాయిలో మృతి చెందుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోళ్ల ఫామ్‌ల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

చికెన్ అమ్మకాలపై తాత్కాలిక నిషేధం

బర్డ్ ఫ్లూ పర్యవసానాలను దృష్టిలో ఉంచుకుని, కొంతకాలం పాటు చికెన్ అమ్మకాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే, స్థానిక మార్కెట్లలో మృత కోళ్లు విక్రయించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అధికారుల సూచనలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అలెర్ట్

తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నందున ఇతర జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోళ్ల ఫామ్‌లకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, పౌల్ట్రీ పరిశ్రమలు ఆయా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచనలు ఇస్తున్నారు.

ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. కోళ్ల మృతికి గల అసలు కారణాలను పరిశీలించేందుకు ల్యాబ్ పరీక్షల నిర్వహణ జరుగుతోంది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల వ్యాపారంపై తాత్కాలిక నిబంధనలు విధించే అవకాశం ఉందని సమాచారం.

ప్రజల జాగ్రత్తలు

  1. అపరిశుభ్రంగా ఉన్న కోళ్ల మాంసాన్ని తినకుండా ఉండాలి.
  2. కోళ్ల ఫామ్‌లను సందర్శించకుండా, మరింత జాగ్రత్తగా ఉండాలి.
  3. కోళ్ల వ్యాపారులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
  4. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.

ఈ పరిణామాల నేపథ్యంలో, బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గించే విధంగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

bird flu Breaking News in Telugu chickens Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online Wanaparthy district

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.