📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kavitha New Party: కవిత కొత్త పార్టీ పేరు ఇదే!

Author Icon By Anusha
Updated: March 19, 2026 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kavitha New Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేగవంతం చేశారు. ఇప్పటికే పార్టీ పేరు, ఎన్నికల ప్రణాళికపై స్పష్టత రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: Paneer : హైదరాబాద్‌లో భారీగా కల్తీ పనీర్ సీజ్

జూన్ 2న ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం’ నాడు ఆవిష్కరణ

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నాడు భారీ బహిరంగ సభ ద్వారా రాజకీయంగా కొత్త లక్ష్యం ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా తన పార్టీ పేరు ఖరారు చేసారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న పార్టీ పేరు, జెండా, అజెండాను ఆమె లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

This is the name of Kavitha’s new party!

అయితే, తాజాగా ఢిల్లీ హైకోర్టులో కవిత పిటీషన్ దాఖలు చేసారు. ఎన్నికల సంఘం వేగంగా తమ దరఖాస్తు పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసును న్యాయస్థానం మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ ద్వారానే పోటీ చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జాగృతి బృందంతో కలిసి పార్టీ నిర్మాణ కసరత్తును ఆమె ముమ్మరం చేశారు.

కవిత తన స్వచ్ఛంద సంస్థ ‘తెలంగాణ జాగృతి’ పేరు స్ఫూర్తితో, కొత్త పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక పసుపు, ఎరుపు రంగుల్లో పార్టీ జెండాను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ వెంట బీసీ ఓటు బ్యాంక్ ఉండేది. ఆ ఓటు బ్యాంక్ ను తనవైపు తిప్పుకునేలా పసుపు టచ్ ఇస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో నడుస్తున్న చర్చ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

June 2 Telangana Party Launch Kalvakuntla Kavitha New Party MLC Kavitha Delhi High Court Petition Telangana Praja Jagruthi Name

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.