Thirumalagiri Municipality: తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం

Read Time:  1 min
Thirumalagiri Municipality: తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం
FONT SIZE
GET APP
Thirumalagiri Municipality: Police enthusiasm in Tirumalagiri
Thirumalagiri Municipality: Police enthusiasm in Tirumalagiri

Thirumalagiri Municipality: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ సిబ్బంది సహాయంతో అధికారులు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం వివాదానికి దారితీసింది. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా, చీకటి పడ్డాక దొంగచాటుగా ఫ్లెక్సీలు తొలగించడంపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Read Also: Telangana political news : కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు, విచారణ డిమాండ్

ఎస్ఐ దుర్భాషలాడారంటూ ఆరోపణలు

ఫ్లెక్సీల తొలగింపును అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకుల పట్ల స్థానిక ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇదేంటని నిలదీసిన నాయకులను ఎస్ఐ అసభ్య పదజాలంతో దూషించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే స్వయంగా దుర్భాషలాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ కుట్ర అంటూ ఆగ్రహం

తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ కుట్రకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మున్సిపల్ అధికారులను, పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ తిరుమలగిరిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టే యోచనలో ఉన్నాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.