📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నేతలను డిస్టర్బ్ చేసేందుకే ఈ కుట్రలు

Author Icon By Sudheer
Updated: January 29, 2026 • 11:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ నోటీసుల వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులను నైతికంగా దెబ్బతీసేందుకు, పార్టీ నేతలను ఆందోళనకు గురిచేసేందుకే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వంటి మహానాయకుడిని ఎన్ని నోటీసులతో భయపెట్టినా ఆయనను ‘ఏమీ చేయలేరని’ (ఏమీ పీకలేరని) జగదీశ్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

Tamil Nadu Elections : విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కార్యకర్తల బలాన్ని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. గతంలో కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చినప్పుడు వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదే కేసీఆర్‌ను తాకాలని చూస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది గులాబీ సైనికులు ఎన్నికలను సైతం పక్కనబెట్టి రోడ్లపైకి వస్తారని, ఆ ఆందోళనను తట్టుకునే శక్తి ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే అధికార పక్షం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోందని ఎద్దేవా చేశారు.

ఈ నోటీసుల పర్వం కేవలం మున్సిపల్ ఎన్నికల మలుపుగా జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. అయితే, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక శక్తి అని, అటువంటి వ్యక్తిని చట్టబద్ధమైన సంస్థల ద్వారా వేధించాలని చూడటం అవివేకమని ఆయన హితవు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Google News in Telugu jagadeesh reddy KCR Latest News in Telugu SIT

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.