📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TGSRTC Supervisor Trainee Hall Tickets Release: ఆర్టీసీ సూపర్‌వైజర్ హాల్ టికెట్లు విడుదల..డైరెక్ట్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

Author Icon By Anusha
Updated: March 22, 2026 • 10:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిరుద్యోగులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. ట్రాఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Read Also: LPG Supply: గ్యాస్ కష్టాలకు చెక్: హోటళ్లు, రెస్టారెంట్లకు ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం

tgsrtc-supervisor-trainee-hall-tickets-released-tslprb-2026

పోస్టుల వివరాలు:

పరీక్షా కేంద్రంలో పాటించాల్సిన కఠిన నిబంధనలు:

రాత పరీక్ష కోసం హాల్ టికెట్లను తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి హాట్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే support@tslprb.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చు. లేదంటే 9391005006 నంబర్‌ను సంప్రదించవచ్చని బోర్డు తెలిపింది. హాల్‌ టికెట్‌పై ఫొటో లేని అభ్యర్ధులను పరీక్షకు అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో అభ్యర్థుల వేలిముద్రలు, డిజిటల్‌ ఫొటోలను సేకరిస్తారు.

కాబట్టి చేతులకు మెహందీ, టాటూలు ఉండకూడదని బోర్డు స్పష్టంచేసింది.మార్చి 29వ తేదీన రాత పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్షను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో విడత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను మార్చి 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 28వ తేదీ అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26,160 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

RTC Recruitment News Telugu Telangana Govt Jobs 2026 TGSRTC Exam Rules Mehendi Tattoos TGSRTC Supervisor Trainee Hall Tickets 2026 TSLPRB RTC Exam Update TST MST Hall Ticket Download Link

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.