📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TGSRTC: చార్జీల పెంపుపై ఆర్టీసీ క్లారిటీ

Author Icon By Anusha
Updated: August 13, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) చార్జీలు పెంచిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సంస్థ ఖండించింది. ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. రెగ్యులర్ సర్వీసుల్లో ఎలాంటి చార్జీల పెంపు జరగలేదని, కేవలం ప్రత్యేక బస్సుల్లో మాత్రమే నిర్దిష్ట చార్జీలు వసూలు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.ఇటీవల సోషల్ మీడియా , కొన్ని వార్తా వేదికల్లో “రాఖీ పండుగ కారణంగా ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పెరిగాయి” అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. దీనిపై టీజీఎస్ఆర్టీసీ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నడిచిన ప్రత్యేక బస్సుల్లో మాత్రమే చార్జీలు సవరించామని, మిగిలిన అన్ని రెగ్యులర్ సర్వీసుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేసినట్లు పేర్కొంది.

రాఖీ పండుగ కోసం ప్రత్యేక బస్సులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ మొత్తం 4,650 ప్రత్యేక బస్సులను నడిపింది.ఈ నెల 7న 407, 8న 960, రాఖీ పండుగ(9న) నాడు 1,570, 10న 781, 11న 932 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ బ‌స్సులు మిన‌హా మిగ‌తా బ‌స్సుల్లో సాధార‌ణ చార్జీలే అమ‌ల్లో ఉన్నాయి. ప్రస్తుతం సంస్థలో 9500 పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. అందులో కొన్నింటినే స్పెషల్ సర్వీసు (Special service) లుగా రద్దీ రూట్లలో నడపడం జరిగింది.ప్రధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణమి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు తిప్పుతుంది.

TGSRTC

9500 పైగా బస్సులలో కొన్నింటినే స్పెషల్ సర్వీసులు

తిరుగు ప్రయాణంలో స్పెష‌ల్ బ‌స్సుల్లో ప్రయాణికుల ర‌ద్దీ ఏమాత్రం లేన‌ప్పటికీ.. ర‌ద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండేందుకు ఖాళీ బ‌స్సుల‌ను త్వర‌తగ‌తిన సంస్థ వెన‌క్కి తెప్పిస్తుంది. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహ‌ణ మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహ‌ణ మేరకు టికెట్ ధ‌ర‌ల‌ను 50 శాతం వరకు సవరించుకునే వెసులుబాటును సంస్థకు కల్పించింది.స్పెషల్ బస్సులకు చార్జీల సవరణ అనవాయితీగా జరిగేదే. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో చార్జీల సవరణ అనేది జీవో ప్రకారం 22 ఏళ్లుగా కొనసాగుతోంది. పండుగ రద్దీ రోజుల్లో స్పెషల్ బస్సులు మినహా, సాధార‌ణ రోజుల్లో య‌థావిధిగా సాధారణ టికెట్ ధ‌ర‌లే అమల్లో ఉంటాయి. ఇది సంస్థలో సంప్రదాయంగా కొనసాగుతున్న ప్రక్రియ.

ప్రయాణికులకు భరోసా

అదేం తెలియకుండా కొందరు పండుగ పేరుతో అన్ని సర్వీసుల్లో చార్జీలను పెంచినట్లు ఉద్దేశపూర్వకంగా సంస్థపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ పేర్కొంది.ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూ.. ప్రతి రోజు ల‌క్షలాది మందిని టీజీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తోంది. సిబ్బంది నిబద్దత, అంకితభావంతో విధులు నిర్వర్తించడం వల్లే ల‌క్షలాది మంది నమ్మకాన్ని సంస్థ చూరగొంది. అలాంటి సంస్థపై కావాలని తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం తగదని.. టీజీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేస్తోన్న ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు యాజమాన్యం తెలిపింది.. వాస్తవాలు తెలుసుకోకుండా.. అబద్దపు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించింది.

TGSRTC ఎప్పుడు ఏర్పడింది?

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఏపీఎస్‌ఆర్టీసీ నుండి విడిపోయి ప్రత్యేకంగా ఏర్పడింది.

TGSRTC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nalgonda-court-mother-sentenced-to-20-years-in-prison-for-trying-to-destroy-childs-life/telangana/529777/

Breaking News bus fare clarification government order latest news passenger rush Rakhi festival Special buses telangana rtc Telugu News tgsrtc announcement ticket charges

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.