TGSRTC free bus service : తెలంగాణ ప్రజలకు బంపర్ గిఫ్ట్ ఆర్టీసీ ఫ్రీ బస్సుల ప్రకటన…

Read Time:  1 min
TGSRTC free bus service : తెలంగాణ ప్రజలకు బంపర్ గిఫ్ట్ ఆర్టీసీ ఫ్రీ బస్సుల ప్రకటన…
FONT SIZE
GET APP

TGSRTC free bus service : తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు శుభవార్త అందించింది. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి భారీ స్పందన రావడంతో, ప్రజలు ప్యూచర్ సిటీని సందర్శించేందుకు ఉచిత బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ ఈడీ ఎం. రాజశేఖర్ అధికారికంగా తెలిపారు.

డిసెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు, హైదరాబాదులోని ముఖ్య ప్రాంతాలైన జేబీఎస్, శంషాబాద్, ఎంజీబీఎస్, ఉప్పల్, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్‌ల నుంచి ప్యూచర్ సిటీకి ఫ్రీ బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 9, 10, 11, 12 గంటలకు ప్యూచర్ సిటీకి బయల్దేరగా, సాయంత్రం 4, 5, 6, 7 గంటలకు అక్కడి నుంచి తిరిగి బస్సులు ప్రయాణం ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు.

Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని

ప్రజలు మరిన్ని వివరాల కోసం 9959226160 నంబర్‌ను సంప్రదించవచ్చు. (TGSRTC free bus service) ప్యూచర్ సిటీని సందర్శించేందుకు ఏర్పాట్లు చేయడం వెనుక ఉద్దేశ్యం తాజాగా గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల ప్రభావాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూడలాగే అవకాశం కల్పించడమే.

ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణకు రూ. 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో పెట్టుబడులని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ పెట్టుబడులు రాష్ట్రంలో వృద్ధి, ఉపాధి అవకాశాలు భారీగా పెంచుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.