📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TGSRTC: ఐదు రోజుల కార్తికమాసం స్పెషల్ ప్యాకేజ్

Author Icon By Tejaswini Y
Updated: November 12, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TGSRTC: కార్తికమాసం హిందువుల దృష్టిలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో దేవాలయాలు శివనామస్మరణతో మారుమోగుతుంటాయి. భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. పుణ్యక్షేత్రాలను సులభంగా దర్శించుకునేలా ఐదు రోజుల యాత్రా ప్రణాళికను సిద్ధం చేసింది.

Read Also: Onion Prices: దారుణంగా పడిపోయిన ఉల్లి ధరలు

ఈ టూర్‌లో భాగంగా తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు ఈ పవిత్రక్షేత్రానికి తరలివెళ్తుండడంతో, తక్కువ వ్యయంతో సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ ఈ టూర్‌ను ప్రారంభించింది.

భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుండి ఈ నెల 18వ తేదీ రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరనుంది. 40 మంది భక్తులు ఈ ప్రయాణంలో పాల్గొనవచ్చు. ఐదు రోజుల ఈ యాత్రకు ఒక్కో వ్యక్తికి ₹5,300గా చార్జ్ నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం 97019 67519 లేదా 99592 26707 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

అరుణాచల యాత్రతో పాటు

అరుణాచల యాత్రతో పాటు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, పిఠాపురంలోని పురహూతికాదేవి ఆలయం, సామర్లకోట కుమారరామ భీమేశ్వర ఆలయం, రాజమండ్రి ఘాట్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికి కూడా ప్రత్యేక సేవలను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

అలాగే అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ దర్శనానికి ఈ నెల 12వ తేదీ రాత్రి 9 గంటలకు భూపాలపల్లి నుంచి మరో ప్రత్యేక బస్సు సర్వీస్ కూడా నడపనున్నారు. ఈ యాత్రకు ఒక్కో భక్తుని టికెట్ ధర ₹2,300గా నిర్ణయించారు. మూడు రోజుల పాటు వైజాగ్ టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AnnavaramTemple ArunachalamTour DevotionalTrips karthikamasam PithapuramTemple SamarlakotaTemple TelanganaNews TelanganaRTC VijayawadaKanakaDurga

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.