హైదరాబాద్ నగరంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది (Musi River) ఉగ్రరూపం దాల్చింది. సాధారణ ప్రవాహానికి మించి, మూసీ నది ఉప్పొంగి ప్రవహించడం ప్రారంభించింది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు అయిన పురానాపూల్, జియాగూడ్, చాదర్‌ఘాట్ వద్ద వరద ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితులు వలన ఎంబీజీఎస్ ప్రాంగణంలో వరద నీరు చేరడంతో నగరంలోని ప్రజలు, ప్రయాణికులు పెద్ద ఇబ్బందులకు గురయ్యారు.
OG Movie: ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా?.. హైకోర్టు సీరియస్
తాజాగా మూసీ నది ఉప్పొంగిన నేపథ్యం దృష్ట్యా, టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) అధికారులు ఎంబీజీఎస్ బస్ స్టేషన్ నుంచి అన్ని బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, నగర ప్రయాణికుల ఆందోళన తగ్గించడానికి, ఈ బస్సుల గమ్యస్థానాలను మార్గాలను మార్చి వేరే ప్రాంతాల నుంచి నిర్వహించటం ప్రారంభించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే బస్సులు ఇప్పుడు జేబీఎస్ నుండి ప్రయాణం చేస్తున్నారు.
వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లే సర్వీసులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ ద్వారా వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడకు వెళ్ళే బస్సులు ఎల్బీనగర్ ప్రాంతం (LB Nagar area) నుంచి నిర్వహిస్తున్నారు. అలాగే, మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్ళే సర్వీసులు ఆరాంఘర్ చౌరస్తా నుంచి ప్రయాణిస్తున్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని
ఎంబీజీఎస్ (MBGS) నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని.. ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పింది. ఇతర వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది.
ఇక శుక్రవారం అర్థరాత్రి తర్వాత మూసీకి వరద పెరిగింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లోకి భారీగా నీరు చేరింది. దీంతో అధికారులు, పోలీసులు తాడు సహాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం చాదర్ ఘాట్ (Chadar Ghat) వద్ద బ్రిడ్జిని మూసేసారు. పరిహహక ప్రాంతాల్లోకి భారీగా వరద చేరుతుండటంతో స్థానికులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
నేడు కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: