TGSRTC: తెలంగాణ ప్రభుత్వం (TG Govt) పౌర సేవలను మరింత చేరువ చేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. మీసేవ ఆధ్వర్యంలోని ‘మీ టికెట్’ (Mee Ticket) మొబైల్ యాప్‌లో టీజీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌ల సేవలను అనుసంధానించింది. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు బస్‌పాస్‌ల కోసం గంటల తరబడి డిపోల వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది.
Read Also: E voting: ఇ ఓటింగ్.. ఒక విప్లవాత్మక అడుగు
దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ
ప్రభుత్వ అధికారిక మొబైల్ యాప్ ద్వారా నేరుగా బస్‌పాస్‌లను జారీ చేస్తున్న దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు కేవలం నగర బస్‌పాస్‌లే కాకుండా, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పొందే వెసులుబాటు కలిగింది. డిజిటలైజేషన్ దిశగా ఆర్టీసీ వేసిన ఈ అడుగు ప్రయాణికులకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది.
డిజిటల్ పాస్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ యాప్‌లో అత్యాధునిక సాంకేతికతను జోడించింది. ఇందులో డైనమిక్ క్యూఆర్ కోడ్ (Dynamic QR Code), లైవ్ వాలిడిటీ సూచిక, భద్రత కోసం స్క్రీన్‌షాట్ నిరోధక (Anti-screenshot) వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఒకరి పాస్‌ను మరొకరు ఉపయోగించుకునే అవకాశం ఉండదు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: