📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TGSRTC – తెలంగాణలో పండుగలకు 7754 ప్రత్యేక బస్సులు

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

20 నుంచి అక్టోబరు 2 దాకా స్పెషల్ సర్వీసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించే బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిజిఎస్ఆర్టీసి) (TGSRTC) యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దసరా, బతుకమ్మ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. వాటిలో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టిసి ప్రకటించింది.

సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండ టంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో (Hyderabad) ప్రధాన బస్టాండులైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తోపాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది.

తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు

హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు (Special buses) నడుపుతోంది. దసరా స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరించనుంది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదివరకు వరకు…. అలాగే అక్టోబర్ 1,5,6 తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ (అదనపు) ఛార్జీలు అమల్లో ఉంటాయి.

TGSRTC

ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని.. అవి యధావిధిగా ఉంటాయని ఆర్టిసి పేర్కొంది. గత దసరా కంటే ఈ సారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని.. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, మౌలిక సదుపాయాలతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టం (Public Address System) ను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ తెలిపారు.

ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని

ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామని, ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని తెలిపారు.పోలీస్, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసు కుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని సజ్జనార్ సూచించారు.

ఆర్టీసిలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టిజిఎస్ఆర్టిసి కాల్ నెంబర్ 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sarees-distributed-to-women-at-the-rate-of-two-per-bathukamma/telangana/550107/

Breaking News cbs dussehra 2025 festive rush hyderabad bus stations jbs kphb colony latest news mgbs saddula bathukamma Special buses Telugu News uppal crossroads

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.