📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TGSRTC: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు

Author Icon By Saritha
Updated: February 18, 2026 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TGSRTC: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రత పెరుగుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ నగర ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి నుంచి ఎండలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు (Electric AC bus) ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read Also: Kathanpalli: మంచిర్యాల లో బంద్‌ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ ఆందోళనలు

TGSRTC: 30 percent fare reduction in AC buses

మార్చి ఒకటో తేదీ మే నెలాఖరు వరకు

మార్చి ఒకటో తేదీ నుంచి ఎండాకాలం పూర్తయ్యే వరకు అంటే మే నెలాఖరు వరకు హైదరాబాద్ (Hyderabad) సిటీ ఏసీ సర్వీసుల్లో టికెట్ ఛార్జీలు 30 శాతం తగ్గించనున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ జోన్‌లో మాత్రమే అమల్లోకి రానుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలకు సమానంగా ఏసీ బస్సుల్లోనూ ఛార్జీలు ఉండనున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు తిరిగే పుష్పక్‌ ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని ఏసీ బస్సుల్లో ఈ టికెట్ తగ్గింపును అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు తిరుగుతుండగా వీటిలోనే ఛార్జీల తగ్గింపును ఆర్టీసీ అధికారులు అమలుచేయనున్నారు. ఏసీ బస్సుల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటుండటంతో వాటిని ఆశ్రయించలేకపోతున్నారు. తాజాగా ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రయాణికలుక ఊరట లభించనుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరతోనే ఏసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిచటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AC Bus Ticket Discount Hyderabad AC Bus Fare Hyderabad Metro Express Fare Hyderabad Transport News Latest News in Telugu Summer Bus Offer Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.